hike salaries 15 శాతం వేతనం పెంచేందుకు అంగీకారం
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:36 PM
hike salaries రైస్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు ఈ ఏడాది 15 శాతం వేతనాలు పెంచేందుకు అంగీకారం కుదిరింది.

పలాసరూరల్,డిసెంబరు27(ఆంధ్రజ్యోతి): రైస్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు ఈ ఏడాది 15 శాతం వేతనాలు పెంచేందుకు అంగీకారం కుదిరింది. తహసీల్దార్ కార్యాల యంలో శుక్రవారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి చెంది న రైస్‌మిల్లర్లు, కార్మికుల మధ్య చర్చలు నిర్వహించారు. ఇరువర్గాల ప్రతినిధులు మాట్లాడుకుని ఈ మేరకు అంగీకారం తెలిపారు. రైతులు, కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మంచి మనసుతో ఈ ఒప్పందాన్ని తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి సమక్షంలో నిర్వహించినట్లు ఇరువర్గాల ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో మిల్లుల యాజ మానులు డోకి రామారావు, సిందిరి కిశోర్, కార్మిక సంఘం ప్రతినిధి అంబటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.