Share News

CS with Sikkolu సిక్కోలుతో సీఎస్‌కు అనుబంధం

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:12 AM

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీగా కె.విజయానంద్‌ నియమితులైన విషయం తెలిసిందే.

CS with Sikkolu  సిక్కోలుతో సీఎస్‌కు అనుబంధం
సీఎస్‌గా నియమితులైన అప్పటి జిల్లా కలెక్టర్‌ విజయానంద్‌

- రెండు దశాబ్దాల కిందట జిల్లా కలెక్టర్‌గా విజయానంద్‌

శ్రీకాకుళం, డిసెంబర్‌ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీగా కె.విజయానంద్‌ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన ఒకప్పుడు శ్రీకాకుళం కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. రెండు దశాబాల కిందట.. అంటే 2002 నుంచి 2004 మధ్య కాలంలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం కలెక్టర్‌ గా విజయానంద్‌ వ్యవహరించారు. ఆ సమయంలో జిల్లా ప్రగతికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసు కోవడంతోపాటు నిధులు రప్పించడంలో ప్రజాప్రతినిధులతో మాట్లాడి చురుగ్గా వ్యవహరించారన్న పేరు ఉం ది. విజయానంద్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో జాతీయ రహదారిని ఆనుకుని ‘విజయాదిత్య పార్క్‌’ రూపుదిద్దుకుంది. అలాగే అప్పటి ప్రజాప్రతినిధులు.. ప్రస్తుత మంత్రులు.. కీలక స్థానాల్లో ఉన్నవారి వద్ద సౌమ్యులుగా మంచి పేరు సంపాదించారు. విజయానంద్‌ను సీఎస్‌గా నియమించారన్న వార్త ప్రచార మాధ్యమాల్లో తెలియగానే.. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూటమి ప్రభుత్వం సీఎస్‌గా అవకాశం కల్పించి ప్రా ధాన్యం ఇవ్వడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాను మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు అవసరమైన సాయం అందిస్తారని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:12 AM