Share News

సమస్యల పరిష్కారానికి కదంతొక్కిన ఆదివాసీలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:01 AM

హక్కుల సాధన కోసం ఆదివాసీ లు కదం తొక్కా రు. సోమవారం డివిజన్‌ కేంద్ర మైన టెక్కలి టెక్కలి- తెం బూరు రోడ్డు జంక్షన్‌ నుంచి గిరిజనులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సంప్రదాయ నృత్యాలతో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి భారీ ర్యాలీ నిర్వహించారు.

సమస్యల పరిష్కారానికి కదంతొక్కిన ఆదివాసీలు
పట్టణంలో గిరిజనుల భారీ ర్యాలీ

- టెక్కలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం గేట్లు మూసేసిన పోలీసులు

టెక్కలి: హక్కుల సాధన కోసం ఆదివాసీ లు కదం తొక్కా రు. సోమవారం డివిజన్‌ కేంద్ర మైన టెక్కలి టెక్కలి- తెం బూరు రోడ్డు జంక్షన్‌ నుంచి గిరిజనులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సంప్రదాయ నృత్యాలతో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యాలయంలోకి వెళ్లకుండా ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌, సిబ్బంది గేట్లను మూసివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతసేపటికి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా వచ్చి ఆదివాసీ సంఘ నేతల నుంచి వినతిపత్రం స్వీక రించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాకి మధు, ఉపాధ్యక్షుడు వాబ యోగి మాట్లాడుతూ.. కుల రాజకీయాలు చేస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాంను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని, రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఆదివాసీలను దగా చేస్తున్నారని ఆరోపించారు. గిరిజనులు కాని కులాలను ఎస్టీ జాబితాల్లో చేరుస్తున్నారని విమర్శించారు. జిల్లాలో అసలు బెంతు ఒరియాలు లేరని, బెంతు ఒరియాలు ధర్నాలు చేయడం అవివేకమని, వారికి మద్దలిచ్చే నా యకులకు గిరిజనులంతా ఓట్లతో బుద్ధిచెబుతారని స్పష్టం చేశారు. నకిలీ బెంతు ఒరియా ధృవపత్రాలతో ఉద్యోగాలు చేస్తున్న సుమారు రెండు వేల మందిని ఉద్యో గాల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చవద్దన్నారు. బీసీ-ఏలకు చెందిన వడ్డి కులస్థులు ఎస్టీలెలా అవుతారని ప్రశ్నిం చారు. ఆదివాసీ సంఘ నాయకులు బూరాడ అప్పన్న, బైదిలాపురం సింహాచలం, సవర రాంబాబు, బెజ్జి కృష్ణ, యడ్ల సూర్యనారాయణ, చిన్నారావు, అనిరుద్రుడు, మాధవయ్య, గణేష్‌, జగన్‌దొర, భాస్కర్‌, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంకల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:02 AM