Share News

రానున్న ఎన్నికల్లో ఆదివాసీ సంఘం పోటీ

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:33 AM

ఆదివాసీల సంస్కృతి బతికి ఉండాలంటే పోరాటాలు చాలవని, రాజ్యాధికారం అవసరమని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, ప్రధాన కార్యదర్శి కుంజు శ్రీను అన్నారు. ఆదివారం పురుషోత్తకర్ర మామిడి తోట లో ఆదివాసీల ఆత్మీక కలయిక కార్యక్రమం నిర్వహించారు.

రానున్న ఎన్నికల్లో ఆదివాసీ సంఘం పోటీ

జలుమూరు (సారవకోట): ఆదివాసీల సంస్కృతి బతికి ఉండాలంటే పోరాటాలు చాలవని, రాజ్యాధి కారం అవసరమని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, ప్రధాన కార్యదర్శి కుంజు శ్రీను అన్నారు. ఆదివారం పురుషోత్తకర్ర మామిడి తోట లో ఆదివాసీల ఆత్మీక కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. అసెంబ్లీలో ఆదివాసీల గురించి, చట్టాల గురించి మాట్లాడేవారు లేకపోవడం వల్ల తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సంక్షేమ పరిషత్‌ తరఫున రాష్ట్రంలోని 9 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఆదివాసీలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వం లో అన్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో మెళియాపుట్టి జడ్పీటీసీ గూడా ఎండయ్య, సంక్షేమ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు గురాడ అప్పన్న, గిరిజన నాయకులు బింజన్న, చింతపల్లి భాస్కరరావు, పడాల మాధవయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:33 AM