Share News

ఆదిత్యుని హుండీ ఆదాయం రూ.73 లక్షలు

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:18 PM

ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి హుండీల లెక్కింపు సోమవారం జరిగింది. 39 రోజులకుగాను రూ.73,05,873 ఆదాయం లభించినట్టు ఈవో ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు.

ఆదిత్యుని హుండీ ఆదాయం రూ.73 లక్షలు
అరసవల్లిలో హుండీ ఆదాయం లెక్కింపు

అరసవల్లి, జూన్‌ 10: ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి హుండీల లెక్కింపు సోమవారం జరిగింది. 39 రోజులకుగాను రూ.73,05,873 ఆదాయం లభించినట్టు ఈవో ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. శ్రీహరి సేవాసమితి సభ్యులతో ఆలయ అనివెట్టి మండపంలో నిర్వహించిన లెక్కింపులో నోట్ల రూపేణా రూ.70,38,653, చిల్లర ద్వారా రూ.2,67,120 లభించాయి. బంగారం 26 గ్రాములు, వెండి 4.200 కిలోలు, యూఎస్‌ డాలర్స్‌ మూడు, రూ.50 శ్రీలంక కరెన్సీ, మలేషియా రింగిట్స్‌ ఒకటి వచ్చాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ పర్యవేక్షణలో చేపట్టిన ఈ లెక్కింపులో శ్రీకూర్మం ఆలయ ఈవో జి.గురునాథరావు, దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌బాబు, టెక్కలి ఈవో మనస్విని, జిల్లా దేవదాయశాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ బీఎస్‌ రవికుమార్‌, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:18 PM