Share News

వైసీపీ నుంచి చేరికలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:19 AM

వైసీపీ నుంచి టీడీపీలోకి పలు మండలాలకు చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలు చేరారు. నరసన్నపేటకు చెందిన వెలమ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పంగ కృష్ణవేణి భర్త, సర్పంచ్‌ పంగ బాబాజీ నాయుడుతో పాటు ఆయన అనుచ రులు మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

 వైసీపీ నుంచి చేరికలు
అచ్చెన్నాయుడు, బగ్గు రమణమూర్తి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న సర్పంచ్‌ పంగ బావాజీ నాయుడు

వెలమ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌, భర్త తదితరులు టీడీపీ తీర్థం

టెక్కలి/నరసన్నపేట/సంతబొమ్మాళి/నందిగాం: వైసీపీ నుంచి టీడీపీలోకి పలు మండలాలకు చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలు చేరారు. నరసన్నపేటకు చెందిన వెలమ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పంగ కృష్ణవేణి భర్త, సర్పంచ్‌ పంగ బాబాజీ నాయుడుతో పాటు ఆయన అనుచ రులు మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ నుంచి బల్లి ఢిల్లీతో పాటు వార్డు సభ్యులు దాసరి తవుడు, బొడ్డు సింహాచలం తదితరులు చేరారు. సంతబొ మ్మాళి మండలం హెచ్‌ఎన్‌పేట, పాతమేఘవరం గ్రామాల నుంచి మత్స్య కారులు, నందిగాం, నౌపడా పంచాయతీల నుంచి కూడా సుమారు 90 కుటుం బాలు టీడీపీలో చేరాయి. వీరికి నిమ్మాడలోని క్యాంపు కార్యాలయం లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కండువాలు వేసి ఆహ్వానించారు.

బగ్గు సమక్షంలో చేరిన కృష్ణవేణి

గొట్టిపల్లి, రెడ్డికపేట, కంబకాయ నుంచి కూడా పలువురు నేతలు టీడీపీలో చేరారు. వెలమ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పంగ కృష్ణవేణి, మాజీ సర్పంచ్‌ పంగ శ్రీరాములుతో పాటు చిన్న కరగాం, పెద్దకరగాం, నారాయణవలస, అంపలాంక చెందిన పలువురు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి నరసన్న పేట ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో కింజరాపు హరివరప్రసాద్‌, బగాది శేషగిరి, అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారులను ఆదుకుంటాం

టెక్కలి: ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తీరప్రాంత మత్స్య కారులను ఆదుకుంటామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి ఎన్టీఆర్‌ భవన్‌లో మత్స్య కారులు, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం మండలాల ముఖ్య నాయకులతో వేర్వేరుగా సమావేశం నిర్వహిం చారు. భావనపాడు ప్రాంతంలో మత్స్య కారులకు అవసరమైన జట్టీ నిర్మాణానికి, భావనపాడు బీచ్‌ను పర్యా టకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఈనెల 22న టెక్కలి అసెంబ్లీ నియోజక వర్గం కూటమి అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నానని, దీంతో వైసీపీలో వణు కు మొదలవుతుందన్నారు. సుమారు 50వేల మందికి తక్కువ లేకుండా నామినేషన్‌ ప్రక్రియకు టెక్కలి-తెంబూరు రోడ్డు జంక్షన్‌కు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు.

వైసీపీకి ఓటు వేస్తే వృథా

సంతబొమ్మాళి: ఓడిపోయే వైసీపీకి ఓటు వేస్తే వృథా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం బోరుభద్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తీరప్రాంత కూడలి గ్రామమైన బోరుభద్ర అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేశానని, రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ది చేస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు జీరు భీమారావు,రెడ్డి అప్పన్న, నేతలు వజ్జ ప్రభాకర్‌, అప్పిని వెంకటేష్‌, వల్లభ వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:19 AM