Share News

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:20 PM

విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించి అధి క ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఏవో సునీత హెచ్చరించారు. సోమవారం ఆర్బీకేల్లో విత్తనాలు నమోదు పక్రియను పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. విత్తనాల కోసం ఆర్‌బీకేల్లో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం
హిరమండలం: విత్తనాల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న ఏవో సంధ్య

నరసన్నపేట: విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించి అధి క ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఏవో సునీత హెచ్చరించారు. సోమవారం ఆర్బీకేల్లో విత్తనాలు నమోదు పక్రియను పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. విత్తనాల కోసం ఆర్‌బీకేల్లో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన తరువాత మొలకశాతం కట్టాలని, విత్తనాల సంచులకు ఉండే ట్యాగ్‌, సంచులను భద్రంగా ఉంచుకోవాలని రైతులను కోరారు. విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవన్నారు. కట్టి జనుము, జీలుగు విత్తనాలు రాయితీపై ఇవ్వనున్నట్లు తెలిపారు.

విత్తన దుకాణం తనిఖీ

హిరమండలం: మండలంలోని శాస్ర్తులపేటలోని ప్రైవే టు విత్తనాల దుకాణాన్ని సోమ వారం వ్యవ సాయాధికారి సంధ్య తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వా లని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే అమ్మాలని సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు అమ్మేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

విత్తనాల కోసం పేర్లు నమోదుచేసుకోండి

పోలాకి: ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి విత్తనాల కోసం సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వ్యవసాయా ధికారి చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. రైతుపాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, విత్తనాలకోసం నగదు చెల్లించాలన్నారు. మండ లంలో 23 సచివాలయ పరిధిలో విత్తనాలను సరఫరా చేస్తా మన్నారు. ఇతర వివరాలకు సమీప ఆర్‌బీకేలకు సంప్రదించాలన్నారు.

నందిగాం: ఖరీఫ్‌కు సంబంధించి వరి విత్తనా ల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారి పి.శ్రీకాంత్‌వర్మ సూచించారు. సాంబ, స్వర్ణ, శ్రీకాకుళం సన్నాలు తదితర తొమ్మిది రకాల వరి విత్తనాలు అందుబాటు లో ఉన్నాయని, పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

Updated Date - Jun 10 , 2024 | 11:20 PM