Share News

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

ABN , Publish Date - May 21 , 2024 | 11:32 PM

టెక్కలి నియోజకవర్గ పరిధిలో అతి సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్ప వని సబ్‌ కలెక్టర్‌, ఆర్వో నూరుల్‌ కమర్‌ స్పష్టం చేశారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
చిలకపాలెం శివానీ కాలేజీలో స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద ఆర్వోతో పార్టీల నేతలు

రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌

టెక్కలి: టెక్కలి నియోజకవర్గ పరిధిలో అతి సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్ప వని సబ్‌ కలెక్టర్‌, ఆర్వో నూరుల్‌ కమర్‌ స్పష్టం చేశారు. మంగళవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో డీఎస్పీ బాల చంద్రారెడ్డితో కలిసి పోలీస్‌, రెవెన్యూ అధికారులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అనుమానితులు, చెడు ప్రవర్తన కలిగిన వారిని ముందుగా గుర్తించి బైండోవర్‌ చేయాలన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవన్నారు. జూన్‌ 7వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, అందువల్ల ర్యాలీలు, సభలు, సమావేశాలకు పోలీసుల నిషేధాజ్ఞలున్నాయన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఏఈఆర్వో మురళీకృష్ణ, సీఐ పైడయ్య తదితరులు పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌రూమ్‌ పరిశీలన

చిలకపాలెం శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ స్ట్రాంగ్‌ రూమ్‌ను మంగళవారం ఆర్వో నూరుల్‌ కమర్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఉండడంతో పాటు ప్రత్యేక పోలీస్‌ బందో బస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్వో తెలిపారు. పరిశీ లించిన వారిలో టీడీపీ నేతలు కింజరాపు హరిప్రసాద్‌, లాయర్‌ అచ్చెన్నాయుడు తదితరులున్నారు.

Updated Date - May 21 , 2024 | 11:32 PM