Share News

క్షణికావేశంలో యువతి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:41 PM

తన మాటకు అన్న అడ్డు చెప్పాడన్న క్షణికావేశంలో ఓ యువతి నిండు జీవితాన్ని బలితీసుకుంది.

క్షణికావేశంలో యువతి ఆత్మహత్య

శ్రీకాకుళం క్రైం: తన మాటకు అన్న అడ్డు చెప్పాడన్న క్షణికావేశంలో ఓ యువతి నిండు జీవితాన్ని బలితీసుకుంది. కు టుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరం లోని మంగువారితోటలో నివసిస్తున్న బొంత రమణి, హేమగిరి రావులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె అభి(17) ఇంటర్‌ సెకెండియర్‌ చదువుతుంది. మంగళవారం తండ్రి హిమగిరిరావు చేపలు తీసుకొచ్చాడు. మధ్యాహ్నం భోజ న సమయంలో కూర విషయంలో అభి తన పెద్ద అన్నయ్య జగదీష్‌తో వాగ్వాదానికి దిగింది. సహజంగా చిన్నతనం నుంచి మొండితనంగా ఉండే అభి.. తన మాటకు అన్నయ్య అడ్డు చెప్పడంతో సాయత్రం ఐదు గంటల వరకు ఎవరితో మాట్లాడ కుండా బయట గదిలోనే కూర్చుంది. రాత్రి 7.45 గంటల సమయంలో తల్లి రమణి వంట చేయడానికి వెళ్లగా.. అభి కనిపించకపోవడంతో హేమగిరిరావుకు చెప్పింది. ఇంట్లో వెతుకుతూ ముందు గదిలో చూడగా.. కిటికీ కర్టన్‌ పైపునకు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే అభిని ఆటోలో రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ ఎస్‌ఐ-2 పి.కామేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లి రమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:41 PM