road accident రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:33 PM
road accident ఇచ్ఛాపురం, ఒడి శా సమీపంలోని వాసుదేవపేట కు చెందిన అజయ్ కుమార్ బెహరా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలయ్యాడు.

నందిగాం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం, ఒడి శా సమీపంలోని వాసుదేవపేట కు చెందిన అజయ్ కుమార్ బెహరా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అజయ్ కుమార్ బెహరా శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం వైపు వెళ్తుండగా లట్టిగాం సమీపంలోని హైవేపై కుక్క అడ్డంగా రావడంతో దాన్ని ఢీకొని బోల్తాపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తర లించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఇతడు ఓ ప్రైవేటు సంస్థలో డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రమాద విష యాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సారా ప్యాకెట్లతో వ్యక్తి అరెస్టు
పలాసరూరల్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): పలాస మండలం గోదావరిపురం గ్రామంలో జారు శంకర్‌ను శుక్రవారం 46 సారా ప్యాకెట్లతో పట్టుకుని అరెస్టు చేసి నట్లు జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాసరావు, కాశీబుగ్గ ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ అధికారి కె.మల్లికార్జునరావు తెలిపారు. గ్రామంలో సారా అమ్ము తున్నట్లు సమాచారం మేరకు పరిశీలించగా పట్టుబడినట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.