Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:09 AM

కమ్మసిగడాం జంక్షన్‌ సమీపంలో ఈ నెల 4న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన బి.ఆదినారాయణ (29) మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఆదినారాయణను ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బంధువులు అతన్ని చికిత్స కోసం శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలిపారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య గుణమాఽధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రణస్థలం: కమ్మసిగడాం జంక్షన్‌ సమీపంలో ఈ నెల 4న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన బి.ఆదినారాయణ (29) మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఆదినారాయణను ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బంధువులు అతన్ని చికిత్స కోసం శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలిపారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య గుణమాఽధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేశారు.

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌..

టెక్కలి: టెక్కలి పంచాయతీ పరిధిలోగల మండా పొలం కాలనీకి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మెట్ట తేజేశ్వరరావు(32) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బంధువుల కథనం మేరకు.. మండాపొలం కాలనీకి చెందిన మెట్ట తేజేశ్వరరావు 192 బీఎన్‌ సీఆర్‌పీఎఫ్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం తోటి సిబ్బందితో మహారాష్ట్రలో ఓ ప్రాంతంలో ఎన్నికల విధులు ముగించుకొని స్ట్రాంగ్‌ రూమ్‌కు సామగ్రిని అప్పగించారు.తోటి సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో వస్తుండగా, కాలకృత్యాలు తీర్చుకునేందుకు ముంబాయి-నాగపూర్‌ హైవేపై గాడ్చిరోలి ప్రాంతంలో దిగాడు. అదే సమయం లో వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్‌ బలంగా ఢీకొనడంతో తేజేశ్వరరావు తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో తేజేశ్వరరావును తోటి సిబ్బంది హుటాహుటిన సమీపంలో ఓ ఆసుపత్రికి తరలించగా, మృతిచెందినట్లు ధ్రువీకరించారు. తేజేశ్వర రావుకు తల్లిదండ్రులు చిన్నారావు, తల్లి వనజాక్షి, భార్య చాందిని, నాలుగేళ్ల కుమారుడు చేతన్‌ ఉన్నారు. ప్రస్తుతం భార్య చాందిని గర్భిణీగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతదేహాన్ని సీఆర్‌పీఎఫ్‌ యూనిట్‌ సభ్యులు శుక్రవారం టెక్కలి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తేజేశ్వరరావు మృతితో భార్య చాందిని, తండ్రి చిన్నారావు, తల్లి వనజాక్షితో పాటు కుటుంబసభ్యులు, బంధువులు విలపిస్తున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:09 AM