వేధింపుల కేసులో ఏడాది జైలు
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:03 AM
భార్యను వేధించిన కేసులో రావలవలస గ్రామానికి చెందిన తాళ్ల రాంబాబుకు ఏడాది పాటు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మున్సిఫ్ కోర్టు న్యాయాధికారి హరిప్రియ గురువారం తీర్పు ఇచ్చినట్టు ఏపీపీ రొక్కం శాంతి సంతోషి తెలిపారు.

నరసన్నపేట: భార్యను వేధించిన కేసులో రావలవలస గ్రామానికి చెందిన తాళ్ల రాంబాబుకు ఏడాది పాటు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మున్సిఫ్ కోర్టు న్యాయాధికారి హరిప్రియ గురువారం తీర్పు ఇచ్చినట్టు ఏపీపీ రొక్కం శాంతి సంతోషి తెలిపారు. ఏపీపీ తెలిపిన వివరాల మేరకు.. రాంబాబుతోపాటు అత్తమామలు, ఆడపడుచు నిత్యమూ వేధిస్తున్నట్టు అతడి భార్య కుమారి 2019 జూన్ 4న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్‌ఐ ఎస్‌కే మహ్మద్ అలీ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ కేసులో వాదోపవాదనలు విన్న న్యాయాధికారి రాంబాబుకు ఏడాది జైలు, రూ.1000 జరిమానా విధించారు. అత్తమామలతో పాటు ఆడపడచుపై కేసును కొట్టివేశారు.