Share News

క్షయ రహిత సమాజమే లక్ష్యం

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:49 PM

క్షయ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలని డీఎంహెచ్‌వో బి.మీనాక్షి అన్నారు.

క్షయ రహిత సమాజమే లక్ష్యం
జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో మీనాక్షి

శ్రీకాకుళం అర్బన్‌: క్షయ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలని డీఎంహెచ్‌వో బి.మీనాక్షి అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో టీబీ శాఖ డీటీవో ఎం.ప్రసాద రావు అధ్యక్షతన ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఎంహెచ్‌వో మీనాక్షి క్షయవ్యాఽధికి కారణమైన బాక్టీరియాను 1882లో కనుగున్న శాస్త్రవేత్త రాబర్ట్‌ కాక్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అ ర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో క్షయ నివారణపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోషకాహార లోపం, వ్యాధి నివారణ శక్తి లోపం కారణంగా టీబీ వ్యాధి వ్యాప్తి జరుగుతుందన్నారు. గతేడాది 1,450 కొత్త కేసులు గుర్తించామని తెలిపారు. క్షయ వ్యాధి లక్షణాలైన దగ్గు, రెండు వారాల పాటు జ్వరం, బరువు తగ్గడం, నోటి నుంచి రక్తం కారడం వంటి జరిగితే తక్షణం వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరు నెలల పాటు మందులు వాడటం వల్ల వ్యాధిని నియంత్రించవచ్చని వివరించారు. అనంతరం క్షయ వ్యాధి నివారణకు కృషి చేస్తున్న వైద్యులు బొడ్డేపల్లి సురేష్‌, న్యూబ్లడ్‌ బ్యాంక్‌ నిర్వాహకు లు మణికంఠ, నర్సింగ్‌ కళాశాల ఫ్రొఫిసర్‌, ప్రొగ్రాం కోఆర్డినేటర్‌ పద్మావతి, టీబీ అసోసియేషన్‌ సెక్రటరీ మంత్రి వెంకటస్వామి, ఎస్‌టీఎస్‌ పి.చిరంజీవి, ఎస్‌టీఎల్‌ ఎస్‌ వై.హేమలత,. డీఏపీసీ డీపీఎం కె.ఉమామహేశ్వరరావు, ఎల్‌టీ ఎస్‌.ఉమామ హేశ్వరిలకు జ్ఞాపికలు అందజేశారు. అలాగే డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్‌ పి.జయకర రావు, నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 11:49 PM