Share News

అవయవదాతకు కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:20 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు బ్రెయిన్‌ డెడ్‌ కాగా.. ముగ్గురుకి అవయవదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు.

అవయవదాతకు కన్నీటి వీడ్కోలు
రవికుమార్‌ పార్థివదేహంతో ర్యాలీగా వెళ్తున్న దృశ్యం

శ్రీకాకుళంక్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు బ్రెయిన్‌ డెడ్‌ కాగా.. ముగ్గురుకి అవయవదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. నందిగాం మండలం మడిగ పురం గ్రామానికి చెందిన రోణంకి రవికుమార్‌(28) ఈ నెల 10వ తేదీన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తెండగా బెండి గేటు వద్ద వ్యాన్‌ ఢీ కొట్టింది. దీంతో రవికుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందు తున్న రవి 17వ తేదీన బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడి తల్లిదండ్రులు నారాయణరావు, నారాయణమ్మలకు విషయం తెలిపి, అవ యవదానంపై అవగాహన కల్పించారు. దీనికి వారు అంగీకరించడంతో జెమ్స్‌ ఆస్పత్రికి రవికుమార్‌ను తరలించారు. జీవన్‌ధాన్‌ ద్వారా అతడి కళ్లు రెడ్‌క్రాస్‌కు, లివర్‌, కిడ్నీలు విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అవయువదాత రవికుమార్‌ పార్ధివ దేహాన్ని ఆసుపత్రి చుట్టూ ర్యాలీగా తీసుకువెళ్లి వైద్యులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు అవయువదాన ధ్రువపత్రాన్ని అందజేశారు. అవయువ దానానికి ఆపరేషన్‌ చేసిన వారిలో వైద్యులు సుధీర్‌, శ్రీనివాసులు, లక్ష్మి లలిత, అశోక్‌ రెడ్డి, బాలమురళి, ప్రవీణ్‌, జ్యోత్స్న తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:20 AM