Share News

జీడి పిక్కల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర కల్పించాలి

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:36 PM

జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర కల్పించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమో క్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్‌ చేశారు. చిననీలావతి గ్రామంలో శనివారం ప్రజాసంఘాల నాయకు లతో సమావేశం నిర్వహించారు.

 జీడి పిక్కల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర కల్పించాలి

పలాసరూరల్‌: జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర కల్పించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమో క్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్‌ చేశారు. చిననీలావతి గ్రామంలో శనివారం ప్రజాసంఘాల నాయకు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, తక్షణం నూతన ప్రభు త్వం స్పందించాలన్నారు. పలాస కేంద్రంగా జీడి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని, విదేశీ జీడిపిక్కల దిగుమతిని ఆపాలని కోరారు. పలాస పరిసర ప్రాంతాల్లో 300 జీడి పరి శ్రమల్లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారని, వారికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా కన్వీనర్‌ జుత్తు వీరా స్వామి, వివిధ సంఘాల నేతలు కోదండరావు, అరుణోదయ రామారావు, వంకల పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:36 PM