Share News

నౌపడలో అ‘పూర్వ’ కలయిక

ABN , Publish Date - Oct 27 , 2024 | 11:18 PM

నౌపడ ప్రభుత్వ పాఠశాలలో 1982- 83 సంవత్స రంలో చదువుకున్న పదో తరగతి విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

నౌపడలో అ‘పూర్వ’ కలయిక
నాటి ఉపాధ్యాయులతో విద్యార్థులు:

సంతబొమ్మాళి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): నౌపడ ప్రభుత్వ పాఠశాలలో 1982- 83 సంవత్స రంలో చదువుకున్న పదో తరగతి విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నేటి యోగక్షేమాలను ఒకరికొకరు తెలుపు కున్నారు. నాటి ఉపాధ్యాయులు చెన్నూరు విజయానందరాజా, రామముని కృష్ణారావు శర్మలను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బొమ్మాళి రవికుమార్‌, లోపింటి రాజశేఖర్‌, గిరిధర్‌, దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 11:18 PM