Share News

మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ పటిష్టంగా అమలుచేయాలి

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:44 PM

రానున్న ఎన్నికలకు సంబంధించి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలని సబ్‌ కలెక్టర్‌, టెక్కలి నియోజకవర్గ ఈఆర్వో నూరుల్‌ కమర్‌ అన్నారు.

మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ పటిష్టంగా అమలుచేయాలి

టెక్కలి: రానున్న ఎన్నికలకు సంబంధించి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలని సబ్‌ కలెక్టర్‌, టెక్కలి నియోజకవర్గ ఈఆర్వో నూరుల్‌ కమర్‌ అన్నారు. మంగళవారం తన కార్యా లయంలో ఏఆర్వోలు, ఎంపీడీవోలు, ఏపీ ఎంలు, ఏపీవోలు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఎన్నికల విధులు పక్కాగా నిర్వ హించాలని, తప్పిదాలు జరగకూడదని, ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకు రావాలన్నారు. క్షేత్రస్థాయిలో పోలింగ్‌ స్టేషన్లు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఎన్నికలకు సం బంధించిన అన్నిరకాల శిక్షణలు త్వరితగతిన పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధం కానున్నట్లు తెలిపారు. సమావేశంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 11:44 PM