హమ్మయ్యా..!
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:18 PM
దానా తుఫాన్ ముప్పు తప్పింది. గత రెండు రోజులుగా మబ్బులు కమ్ముకున్నాయి. శుక్రవారం చిరుజల్లులు పడడంతో రైతులు ఆందోళన చెందారు.

- తప్పిన దానా తుఫాన్ ముప్పు
- పెను నష్టం లేకపోవడంతో రైతులకు ఊరట
నరసన్నపేట, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): దానా తుఫాన్ ముప్పు తప్పింది. గత రెండు రోజులుగా మబ్బులు కమ్ముకున్నాయి. శుక్రవారం చిరుజల్లులు పడడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే తుఫాన్ తీరం దాటడం.. జిల్లాపై అంత ప్రభావం లేకపోవడంతో ఉద్దానంలో కొబ్బరి రైతులు, మైదాన ప్రాంతంలో అన్నదాతలు ఊరట చెందారు. నరసన్నపేట నియోజకవర్గంలో సారవకోట, పోలాకి, నరసన్నపేట, జలుమూరు మండలాల్లో చాలాచోట్ల గాలుల ప్రభావంతో వరిపైరు నేలకొరిగింది. దీంతో కోత పెట్టుబడి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. అయితే పెద్దగా నష్టం లేకుండా.. తుఫాన్ గండం గట్టెక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.