బావిలో రక్తపింజరి పాము
ABN , Publish Date - Nov 26 , 2024 | 11:55 PM
పలాస-కాశీబు గ్గ జంటప్టణాల్లోని బావిలో ప్రమాదకరమైన రక్తపింజరి పామును ఈస్ట్ర డన్‌గాడ్స్ వై ల్డ్‌లైఫ్ సభ్యుడు ఓంకార్ త్యా డి మంగళవారం పట్టుకుని అటవీ సిబ్బంది సహకారంతో అడవుల్లో విడిచిపెట్టారు.
- చాకచక్యంగా పట్టుకున్న స్నేక్‌స్నాచర్
- అటవీ సిబ్బంది సాయంతో అడవిలోకి..
పలాస, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబు గ్గ జంటప్టణాల్లోని బావిలో ప్రమాదకరమైన రక్తపింజరి పామును ఈస్ట్ర డన్‌గాడ్స్ వై ల్డ్‌లైఫ్ సభ్యుడు ఓంకార్ త్యా డి మంగళవారం పట్టుకుని అటవీ సిబ్బంది సహకారంతో అడవుల్లో విడిచిపెట్టారు. ఇది ఆరున్నర అడుగుల పొడవు ఉంది. ఉదయం ఏడు గంటల సమయంలో కూరగాయలు సేకరించడానికి వెళ్లిన రైతులకు బావిలో కదిలిన శబ్దం రావడంతో పరిశీలించగా భారీ రక్త పింజరి పాము కనిపించింది. అటవీశాఖ అధికారులు ఓంకార్‌త్యాడిని తీసుకు ని బావి వద్దకు వచ్చారు. తొ లుత అది నాగుపామని భావించారు. దానిపై మచ్చలు ఉండడంతో ప్రమాద కరమైన రక్తపింజరిగా గుర్తించారు. ఇది ఎక్కు వగా పంట పొలాలు, కొండ ప్రాంతాల్లో ఉంటుంది. ఇది కరిచిన వెంటనే అప స్మారకస్థితికి వెళ్లడంతోపాటు చర్మం ముక్కముక్కలుగా రాలిపోయి మరణం సంభవిస్తుందని చెబుతున్నా రు. కరిచిన వెంటనే తేరుకుని సరైన మందులు వాడితే ప్రాణహాని ఉండదని అంటున్నారు. ఓంకార్‌త్యాడి పామును చాకచ క్యంగా పట్టుకుని సమీప అడవు ల్లో విడిచిపెట్టారు. ఐదు రోజుల క్రితం ఇదే బృందం మెళియాపుట్టి మండలం కరజాడ గ్రామ సమీపంలో అమ్మవారి ఆలయం పొలాల్లో 20 అడుగుల భారీ కొండచిలువను పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టింది. ఇదే మండలం పెద్దమడి ఆశ్రమపాఠశాల తరగతి గదుల్లోకి వెళ్లిన కింగ్‌కోబ్రాను సైతం పట్టుకుని అడ విలో సురక్షితంగా వదిలిపెట్టింది. ఈ సందర్భంగా ఓంకార్‌త్యాడి విలేకర్లతో మాట్లాడుతు పాములు మనుషు లకు ఎలాంటి ప్రమాదం చేయవని, వాటికి హాని తలపెట్టినట్లు గుర్తిస్తే భయంతో కాటు వేస్తాయని అన్నారు. అంతరిం చిపోతున్న జాబితాలో ఉన్న ఇలాంటి పాములు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.