Share News

శిస్తు కాజేసిన వ్యక్తిపై కేసు నమోదు

ABN , Publish Date - May 15 , 2024 | 11:50 PM

దేవుని భూమి శిస్తు డబ్బులు నకిలీ రశీదులతో రైతుల నుంచి కాజేసిన ఆలయ సిబ్బందిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి, కోటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి వాడాడ గ్రామంలో రైతుల ఆధీనంలో భూములకు, సరుబుజ్జిలి మండలం పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన రైతుల వద్ద ఉన్న భూములకు గాను ఆలయానికి శిస్తు కడుతుంటారు.

శిస్తు కాజేసిన వ్యక్తిపై కేసు నమోదు

శ్రీకాకుళం క్రైం: దేవుని భూమి శిస్తు డబ్బులు నకిలీ రశీదులతో రైతుల నుంచి కాజేసిన ఆలయ సిబ్బందిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి, కోటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి వాడాడ గ్రామంలో రైతుల ఆధీనంలో భూములకు, సరుబుజ్జిలి మండలం పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన రైతుల వద్ద ఉన్న భూములకు గాను ఆలయానికి శిస్తు కడుతుంటారు. దీనికి గాను సుమారు రూ.2.20 లక్షల మేర ఆలయ రికార్డుల్లో నమోదు కాలేదు. దీంతో ఆలయ ఈవో సుకన్య విచారించగా.. ఆలయంలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న వల్లూరి సతీష్‌ అనే వ్యక్తి రైతుల నుంచి శిస్తు వసూలు చేసి, వారికి దొంగ రశీదులు ఇచ్చి నగదు కాజేసినట్టు గుర్తించారు. ఈ మేరకు ఈవో సుకన్య వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ బలివాడ గణేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై ఈవో సుకన్యను వివరణ కోరగా.. సతీష్‌ ఆలయంలో రశీదు పుస్తకాలను తస్కరించి శిస్తు డబ్బులు కాజేశారన్నారు. అతడ్ని ప్రస్తుతం సస్పెండ్‌ చేశామని, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

ఇరువర్గాలపై..

శ్రీకాకుళం క్రైం: చాపురం పంచాయతీలో ఈ నెల 13న ఇరు వర్గాల మధ్య జరిగిన కొట్లాటపై కేసు నమోదు చేసినట్టు రూరల్‌ ఎస్‌ఐ వాసుదేవరావు బుధవారం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ వర్గాలమధ్య కొట్లాట చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో కొట్లాట జరగడంతో చాపురంలో రెండు రోజులు పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - May 15 , 2024 | 11:50 PM