Share News

500 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:19 PM

టెక్కలి నియోజక వర్గంలో ఒకే రోజు 500 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. గురు వారం వైసీపీ అభ్యర్థి దువ్వా డ శ్రీనివాస్‌ బంధువులైన టె క్కలి మండలం లింగాల వల స గ్రామానికి చెందిన సంపతిరావు రవీంద్రనాథ్‌ 300 కుటుంబాలతో టీడీపీలో చేరారు.

500 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక
టీడీపీలో చేరిన టెక్కలి మండలం లింగాలవలస గ్రామస్థులు

టెక్కలి/సంతబొమ్మాళి: టెక్కలి నియోజక వర్గంలో ఒకే రోజు 500 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. గురు వారం వైసీపీ అభ్యర్థి దువ్వా డ శ్రీనివాస్‌ బంధువులైన టె క్కలి మండలం లింగాల వల స గ్రామానికి చెందిన సంపతిరావు రవీంద్రనాథ్‌ 300 కుటుంబాలతో టీడీపీలో చేరారు. వీరికి కోటబొమ్మాళిలోని పార్టీ కార్యా లయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కండువాలు వేసి ఆహ్వానించారు. నందిగాం మండలం బాణాపురానికి చెందిన న్యాయవాది కర్రి శేషు తన అను చరులతో, నౌపడాకు చెందిన జర్నలిస్ట్‌ కోట రాము, సంత బొమ్మాళి మండలం వైసీపీ రైతు విభాగం నాయకుడు ముద్దపు రమణమూర్తి, సీతానగరం మాజీ ఎంపీటీసీ బత్తుల హరి శ్చంద్రరావు, భావనపాడుకు చెందిన గొరకల శారద సింహా చలం, టెక్కలి గొల్లవీధికి చెందిన కోనారి కృష్ణ తదితర 200 కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా, రామ్మోహన్‌ నాయుడును ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో టెక్కలి, నందిగాం మండలాల పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్‌, నేతలు ఎల్‌ఎల్‌ నాయుడు, బగాది హరి, రామకృష్ణ, కింగ్‌, లవ కుమార్‌, మామిడి రాము, మట్ట పురుషోత్తం, చిన్నమనాయుడు తదితరులు పాల్గొన్నారు.
సొండి కులస్థులను ఓబీసీల్లో చేర్చేందుకు కృషి: ఎంపీ
టెక్కలి:
సొండి కులస్థులను ఓబీసీల్లో చేర్చేందుకు కృషి చేస్తానని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. గురువారం నిమ్మాడ జంక్షన్‌లో సొండి కులస్థుల ఆత్మీ య సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సొం డి కులస్థులందరూ ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాల న్నారు. ఎమ్మెల్యే అచ్చె న్నాయుడు మాట్లాడుతూ.. సొండి కులస్థులకు ఏ కష్టం వచ్చినా ఆదుకు నేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేత కింజరాపు ప్రసాద్‌, సొండికుల సంఘ రాష్ట్ర అధ్య క్షుడు రత్నాల శేషగిరిరావు, సాహుకారి ఎల్లారావు, దివాకర్‌ చౌదరి, లాభాల శేషగిరి, రత్నాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:19 PM