Share News

టీడీపీలోకి 50 వైసీపీ కుటుంబాలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:23 AM

పెద్దసాన పం చాయతీలోని 50 వైసీపీకు టుంబాలు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కండు వాలు వేసి ఆహ్వానించారు.

టీడీపీలోకి 50 వైసీపీ కుటుంబాలు
టీడీపీలో చేరిన వారితో అచ్చెన్నాయుడు

టెక్కలి: పెద్దసాన పం చాయతీలోని 50 వైసీపీకు టుంబాలు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కండు వాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సీహెచ్‌ వినోద్‌కుమార్‌, బడగల మౌళి, ఇప్పిలి రాంబాబు, బి.మణి, కె.అభి, వంకాల బలుసాకు, టి.రిక్కీ, సీహెచ్‌ సాయి, బి.ఆది, జె.శివతో పాటు 50 కుటుంబాల యువత, పెద్దలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, అందుకే తామంతా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నామన్నారు.

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా

జి.సిగడాం: అభివృద్ధే ధ్యే యంగా పని చేసేందుకు తన వంతు కృషి చే స్తానని ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) అన్నారు. సోమవారం నడిమివలస, ఎందువ, గెడ్డకం చరాం, బాతువ, డీఆర్‌ వలస, పున్నాం, ముసినివలస గ్రామాల్లో ఆత్మీయ కలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో పర్యటిం చి ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు టీడీపీ మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్‌, నాయకులు కుదిరెళ్ల బుజ్జి, కూనుబిల్లి కూర్మారావు, నక్క మురళీ, ముసిలినాయుడు, బాలి తమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.

పొందూరులో ప్రచారం

పొందూరు: మండల కేంద్రం పొందూరు పట్ట ణంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌ సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పట్టణంలోని వీధుల్లో ఇంటింటికి వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. అలాగే రవికుమార్‌ సమక్షంలో పొందూరు మేజరు పంచాయతీకి చెందిన మాజీ ఉప సర్పంచ్‌, వైసీపీ నాయకులు మలిపెద్ది పార్వతి, మలిపెద్ది శ్రీరంగనాయకులు, మేస్త్రి చిన్న తదితర కుటుంబాలు టీడీపీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, నాయకులు కూన సత్యారావు, అన్నెపు రాము, బి.శంకరభాస్కర్‌, వి.మురళి, బాడానా గిరి తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ రంగానికి పెద్దపీట

శ్రీకాకుళం రూరల్‌: ఎన్డీఏ అధికారంలోకి రాగానే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. సింగుపురం పంచాయతీ బగ్గువానిపేట గ్రామంలో సోమవారం ప్రజాగళం, బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఇంటింటా ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొండు జగన్నాథం, టీడీపీ, జనసేన, బీజేపీ నాయ కులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలాగే పాత్రునివలస గ్రామంలో సర్పంచ్‌ పంచిరెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో గొండు శంకర్‌ సతీమణి స్వాతి ప్రచారం నిర్వహించారు. నాయకులు గురునాథ్‌, గుండ శ్యామ్‌సుందర్‌, బాణ్నాల జయమన్మధ, అప్పారావు, మూకళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీని వీడి టీడీపీలో చేరిక

పాతపట్నం: హిరమండలం ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతిరావు ఆధ్వ ర్యంలో పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. సోమవారం స్థానిక టీడీపీ కా ర్యాలయంలో వారికి కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ.. స్థానికేతర నాయ కుల పాలనపై విసుగు చెంది పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. పార్టీలో చేరిన వారిలో వైస్‌ ఎంపీపీ సవర వైకుంఠరావు, పెద్దగూడ ఎంపీటీసీలు సవర శ్రీదేవి, తట్ల శంకర్‌, కరణం ప్రియాంక, హిరమండలం మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు సుంకర కోటేశ్వరరావు, సర్పంచ్‌లు మల్లిపురం రామారావు, మండ చిన్నమ్మి, ఉయ్యక సురేష్‌, కొర్యాయి పెంటయ్య, లావేటి లీలావతి, వబ్బంగి లక్ష్మి, కూరంగి మల్లేశ్‌, పలువురు మాజీ సర్పంచ్‌లు ఉన్నారు. ఇదిలా ఉండగా తామర, తీమర, సీది, పాశిగంగుపేట గ్రామాల్లో మామిడి గోవిందరావు సోమవారం ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎచ్చెర్ల రవీంద్రరావు, కాళ్ల కృష్ణ, కాగితాపల్లి వెంకటరావు, పడ్డాన ఢిల్లీశ్వరరావు, రాడ రామారావు, జనసేన నాయకుడు మిత్తన ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పలువురు నేతలు టీడీపీలోకి..

జలుమూరు (సారవకోట): సారవకోట మాజీ ఎంపీటీసీ వాని కామేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులు వైసీపీని వీడి సోమవారం టీడీపీలో చేరారు. వీరికి కత్తిరివానిపేట పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు సురవరపు తిరుపతిరావు, కోన వెంకటేష్‌, చీడి వెంకటరమణ పాల్గొన్నారు.

పవన్‌ పేరు వింటే జగన్‌కు జ్వరం

ఆమదాలవలస: జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పేరు వింటే సైకో సీఎం జగన్‌రెడ్డికి జ్వరం పట్టుకుందామని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పాత్రుని పాపారావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ విముక్తి ఆంధ్ర ప్రదేశ్‌ ధ్యేయంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముందుకు సాగుతుందన్నారు. పవన్‌ కల్యాణ్‌పై గుంటూరు జిల్లాలో రాయితో దాడి జరిగిన ఘటనను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. నేడు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి గులకరాయి డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ఈయనతోపాటు కోడిపాత్రుని నారాయణరావు, పైడి ప్రసాద్‌ తదతరులు ఉన్నారు.

రాళ్లదాడి మరో కోడికత్తి డ్రామా

పొందూరు: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిపై జరిగిన రాయిదాడి మరోకోడి కత్తి డ్రామా అని టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికలలో ఓటమి తప్పదని భావించి సానుభూతితో గెలవాలనే ఉద్దేశంతోనే ఈ డ్రామా మొదలుపెట్టారన్నారు. గతంలో కోడికత్తి డ్రామాను చూసిన రాష్ట్ర ప్రజలకు ఇది మరో డ్రామా అని అర్ధమైందన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:23 AM