Share News

ఎచ్చెర్లలో 4 గంటలు కరెంట్‌ కట్‌

ABN , Publish Date - May 03 , 2024 | 12:11 AM

ఎచ్చెర్ల పరిసర ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయంతో వినియోగదారులు అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ఎచ్చెర్లలో 4 గంటలు కరెంట్‌ కట్‌

ఎచ్చెర్ల, మే 2: ఎచ్చెర్ల పరిసర ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయంతో వినియోగదారులు అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అసలే వేసవి కాలం కావడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ముందస్తు సమాచారం లేకుండానే విద్యుత్‌ సరఫరా నిలిపేశారని వినియోగదారులు వాపోతున్నారు. రాత్రి 7.30 గంటలకు అధికారులు సరఫరా పునరుద్ధరించారు. దీనిపై ఏఈ వద్ద ప్రస్తావించగా.. ఎచ్చెర్లలోని సబ్‌స్టేషన్‌ వద్ద సాంకేతిక లోపంతో ట్రిప్‌ అవుతుండడంతో సరఫరాలో ఇబ్బంది ఏర్పడిందన్నారు. విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుండా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను కూడా తొలగించామని తెలిపారు.

Updated Date - May 03 , 2024 | 12:11 AM