23.70 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:26 AM
గంజాయి అక్రమంగా రవాణాచేస్తున్న, విక్రయిస్తున్న ముగ్గురు నుంచి 23.70 కిలోలు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఈబీ ఎస్‌ఐ డి.ప్రభాకర్ తెలిపారు. లింగాలవలస గ్రామానికి చెందిన మొజ్జాడ సరస్వతి, హరికృష్ణమ్మపేటకు చెందిన సరస్వతి మరిది బి.ప్రకాష్ ఇళ్లను సోదాలు చేసి 21.20 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే ఒడిశాలోని బొమ్మిక గ్రామానికి చెందిన బృందావతి రౌలు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పాతపట్నం వద్ద 2.50 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

జలుమూరు: గంజాయి అక్రమంగా రవాణాచేస్తున్న, విక్రయిస్తున్న ముగ్గురు నుంచి 23.70 కిలోలు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఈబీ ఎస్‌ఐ డి.ప్రభాకర్ తెలిపారు. లింగాలవలస గ్రామానికి చెందిన మొజ్జాడ సరస్వతి, హరికృష్ణమ్మపేటకు చెందిన సరస్వతి మరిది బి.ప్రకాష్ ఇళ్లను సోదాలు చేసి 21.20 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే ఒడిశాలోని బొమ్మిక గ్రామానికి చెందిన బృందావతి రౌలు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పాతపట్నం వద్ద 2.50 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.