Share News

15 నుంచి ఆదిత్యుని కల్యాణోత్సవాలు

ABN , Publish Date - Apr 12 , 2024 | 11:56 PM

ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం లో ఏటా నిర్వహించే స్వామివారి వార్షిక కల్యాణోహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆలయ ఈవో ఎస్‌.చంద్రశేఖర్‌, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మతో పాటు పాల కమండలి సభ్యులు శుక్రవారం ఆవిష్కరించారు.

15 నుంచి ఆదిత్యుని కల్యాణోత్సవాలు

అరసవల్లి: ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం లో ఏటా నిర్వహించే స్వామివారి వార్షిక కల్యాణోహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆలయ ఈవో ఎస్‌.చంద్రశేఖర్‌, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మతో పాటు పాల కమండలి సభ్యులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. ఈ నెల 15వ తేదీ చైత్ర శుద్ధ సప్తమి సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ‘కల్యాణాంగ ధ్వజారోహణం’ పతాకావిష్కరణ, 18న చైత్ర శుద్ధ దశమి గురువారం రాత్రి 7.30గంటలకు సుగంధ ద్రవ్య మర్థన (కొట్నం దంపు), 19న చైత్ర శుద్ధ ఏకాదశి శుక్రవారం రాత్రి 7.00 గంటలకు అశ్వ వాహనంపై ఉత్సవమూర్తులకు తిరువీధి మహోత్సవం అనంతరం రాత్రి 9.00 గంటలకు ఉషా, పద్మిని, ఛాయా దేవీలతో స్వామివారికి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు. 20న ద్వాదశి శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆగ్నేయ స్థాలీపాక హోమాదులు, విశేష భోగములు, అనంతరం 6.30 గంటలకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 21వ తేదీ ఆదివారం రాత్రి 8.30 గంటలకు సదస్యం, మహాదాశీర్వచనములు, వేద సదస్సు, పండితులకు సత్కారం ఉంటుందన్నారు. అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు రథోత్సవం, మంగళ హారతులు నిర్వహించను న్నట్టు చెప్పారు. 22వ తేదీ సోమవారం రాత్రి 7 గంటలకు తిరువీధి, ఉద్యాన వనంలో తిరుమంగయాళ్వారుల చరిత్ర సంవాదం, హారతి, ప్రాసద వితరణ ఉంటుందన్నారు. 23వ తేదీ మంగళవారం ఉదయం 7.50 గంటలకు సుమంగళి అర్చన, నీలమణి ధారణ, నాకబలి ప్రయుక్త చక్రతీర్థ స్నానం, సాయత్రం ధ్వజారోహణం, రాత్రి 7.15 గంటలకు పుష్పయాగ మహోత్సవం, విశేష అర్చన అనంతరం ఏకాంతసేవ, ఉత్సవ సంప్రదాయ కీర్తనల ఆలాపనతో స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని స్పష్టం చేశారు.

Updated Date - Apr 12 , 2024 | 11:56 PM