గంజాయితో 11 మంది అరెస్టు
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:10 AM
11 Arrested with Ganja దన్నానపేట గ్రామానికి సమీపాన గురువారం రెండు కేజీల గంజాయి బ్యాగులతో కొంతమంది జేఆర్‌పురం పోలీసు లకు పట్టుబడ్డారు.

రణస్థలం, డిసెంబరు 26 (ఆంద్రజ్యోతి): దన్నానపేట గ్రామానికి సమీపాన గురువారం రెండు కేజీల గంజాయి బ్యాగులతో కొంతమంది జేఆర్‌పురం పోలీసు లకు పట్టుబడ్డారు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఒక బాలుడు ఉన్నాడు. జేఆర్‌పురం సీఐ అవతారం అందించిన వివరాల మేరకు రెండు ద్విచక్ర వాహనాలతో జి.సాయి, పి.సత్యనారాయణ, కోల హర్షవర్థన్, పి.దుర్గాప్రసాద్ రెండు బ్యాగులతో గంజాయి తెస్తూ... ఎస్‌ఐ చిరంజీవికి పట్టుబడ్డారు. జి.సాయి అనే యువకుడు పర్లాకిమిడికి చెందిన రబింద్రో ప్రదాన్ వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్నాడు. చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి కె.సంతోష్, బూసర పైడిరాజు, ఉప్పాడ విజయ్ కుమార్, చందక వెంకటేష్, బి.పవన్ కుమార్, ఎం.దిలీప్‌లకు విక్రయిస్తున్నాడు. వీరంతా గంజాయి అలవాటు ఉన్న వారికి ఈ ప్యాకెట్లను అధిక ధరలకు విక్రయిస్తుంటారు. వీరందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ అవతారం తెలిపారు. ఎం.దిలీప్ పరారీలో ఉన్నాడు. గంజాయి కేసును ఛేదించిన జేఆర్‌పురం ఎస్‌ఐ చిరంజీవిని ఎస్‌పీ కేవీ మహేశ్వరరెడ్డి అభినందించినట్లు సీఐ తెలిపారు.