Serial robberies : వరుస చోరీలు - నిద్రావస్థలో పోలీసులు
ABN , Publish Date - Sep 12 , 2024 | 11:11 PM
పట్టణంలో వరుస దొంగత నాలు జరుగుతున్నా పోలీసు లు నిద్రావస్థలో ఉన్నట్లు ఆరోప ణలున్నాయి. తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాలే టార్గెట్‌గా చోరీ లు జరుగుతున్నాయి. బాధితు లు ఫిర్యాదులు చేయాలనుకు న్నా మీ ఇంట్లో ఏం పోలేదు కదా అని పోలీసులు దబాయి స్తున్నారని స్థానికులు ఆరోపిస్తు న్నారు.
పులివెందుల టౌన్, సెప్టెంబరు 12: పట్టణంలో వరుస దొంగత నాలు జరుగుతున్నా పోలీసు లు నిద్రావస్థలో ఉన్నట్లు ఆరోప ణలున్నాయి. తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాలే టార్గెట్‌గా చోరీ లు జరుగుతున్నాయి. బాధితు లు ఫిర్యాదులు చేయాలనుకు న్నా మీ ఇంట్లో ఏం పోలేదు కదా అని పోలీసులు దబాయి స్తున్నారని స్థానికులు ఆరోపిస్తు న్నారు. పోలీసులు నామమా త్రంగా కూడా గస్తీ చేయడం లేదన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. పట్టణంలో వారం రోజు ల్లో జరిగిన దొంగతనాలను పరిశీలిస్తే..
సెప్టెంబరు 8న మా ఊరి సినిమా హీరో మహేష్ ఇంట్లో రూ.10లక్షలు నగదు, 15తు లాల బంగారు అపహరణకు గురైంది. బుధ వారం పట్టణంలోని కోతి సమాధి వద్ద కుళా యమ్మ ఇంట్లో 18 తులాలు బంగారు నగలు, అర కిలో వెండి, రూ.70వేలు నగదు దొంగలిం చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుళా యమ్మ పిల్లల కోసం స్కూలుకు పోయి వచ్చేలోపు ఇంట్లో రెండు బీరువాలు పగలకొట్టి దోచు కెళ్లారని ఫిర్యాదు. గాయత్రీ కాలనీలో బంగారు నగదు, పాల్‌రెడ్డినగర్‌లోని ఓఇంట్లో పది తులాల బంగారు, రెం డు లక్షల రూపాయల నగ దు దోచుకెళ్లారు. శ్రీరామహా లు రూట్‌లోని జీవీకే సూప ర్‌మార్కెట్‌లో అర్ధ రాత్రి ఇద్దరు మహిళలు, పురుషు డు చోరీకి యత్నం చేశారు. సీసీ ఫుటేజీలో రికార్డు అయినా ఇంత వరకు దొంగను పట్టుకోలేకపోయారు.
ప్రజలే గస్తీ తిరగాల్సి వస్తోంది
రాత్రివేళ దొంగల సంచారం ఎక్కువగా ఉండ డంతో పట్టణవాసులే గుంపులుగా గస్తీలు తిర గాల్సి వస్తోంది. ఎప్పుడు ఎవరి ఇంట్లో దొంగ లు పడతారో అన్న భయం పులివెందుల వాసుల్లో నెలకొంది. పోలీసులు తగు చర్యలు తీసుకుని దొంగతనాలు అరికట్టాలి.
- రాజు, పులివెందుల