Employee salaries : పీఆర్ ఉద్యోగులకు ఒక రోజు ముందే జీతం
ABN , Publish Date - Dec 31 , 2024 | 06:50 AM
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులందరికీ జీతాలు జనవరి 1 రాక ముందే విడుదల చేశారు.

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులందరికీ జీతాలు జనవరి 1 రాక ముందే విడుదల చేశారు. స్లాట్‌ను ఒక రోజు ముందే ఇవ్వడంతో మంగళవారం ఉద్యోగుల ఖాతా ల్లో వేతనాలు జమ కానున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలంటే ఠంచనుగా 1న పడతాయన్న నానుడి ఉండేది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీతాల విడుదల అనేది ఫలానా తేదీ అనేది లేకుండా పోయిం ది. ఈ నెల జీతం మరుసటి నెలలో ఇవ్వడం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం జరిగేది. దీంతో ఉద్యోగులు ప్రతి నెలా మొదటి వారంలో జీతాలిస్తే చాలన్న ధోరణికి వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీ జీతాలకు భరోసా దక్కింది. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే సిబ్బందికి వీలైనంత మేరకు 1న జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.