Share News

AP News: సీఎం జగన్‌పై రాయి విసిరిన నిందితుడికి రిమాండ్ విధింపు.. ఎప్పటివరకంటే?

ABN , Publish Date - Apr 18 , 2024 | 08:17 PM

గత శనివారం విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయి విసిరిన నిందితుడికి 14 రోజుల రిమాండ్ పడింది. ఈ మేరకు విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాయి విసిరిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చారు.

AP News: సీఎం జగన్‌పై రాయి విసిరిన నిందితుడికి రిమాండ్ విధింపు.. ఎప్పటివరకంటే?

విజయవాడ: గత శనివారం విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయి విసిరిన నిందితుడికి 14 రోజుల రిమాండ్ పడింది. ఈ మేరకు విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాయి విసిరిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఏ1గా ఉన్న నిందితుడికి మే 2 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. నెల్లూరు జైలులో ఉంచాలని న్యాయమూర్తి అదేశించారు.


రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారా? అని నిందితుడి తరపు న్యాయవాది సలీం వాదించారు. అతడికి గత నేర చరిత్ర ఏమీ లేదని అన్నారు. 307 సెక్షన్‌ ఈ కేసులో వర్తించదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ కేసులో పోలీసులు అందజేసిన పుట్టిన తేదీ వివరాలు ఆధార్‌లో తేదీతో సరిపోలలేదని, ఆధార్‌ కార్డులోని పుట్టినతేదీని పరిగణనలోకి తీసుకోవాలని జడ్జికి న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అయితే పుట్టిన తేదీకి సంబంధించి మున్సిపల్‌ అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్‌ను పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు తెలిపింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 08:19 PM