Share News

ఉత్తరాంధ్ర నుంచి వైవీ అవుట్‌

ABN , Publish Date - Oct 20 , 2024 | 04:32 AM

ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త బాధ్యతల నుంచి రాజ్యసభ సభ్యు డు వైవీ సుబ్బారెడ్డిని తప్పించారు.

ఉత్తరాంధ్ర నుంచి వైవీ అవుట్‌

  • మళ్లీ విజయసాయికి బాధ్యతలు

అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త బాధ్యతల నుంచి రాజ్యసభ సభ్యు డు వైవీ సుబ్బారెడ్డిని తప్పించారు. ఉత్తరాంధ్రకు మళ్లీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సమన్వయకర్తగా నియమించారు. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలను శనివారం వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నియమించారు. ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లాలకు పీవీ మిథున్‌రెడ్డి, ఉమ్మడి ప్రకా శం జిల్లాకు కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు, గుంటూరు జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఉభయగోదావరి జిల్లాలకు బొత్స సత్యనారాయణను నియమించారు. కాగా, చిత్తూరు, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల అధ్యక్షుడిగా భూమన కరుణాకరరెడ్డిని జగన్‌ నియమించారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బూత్‌ కమిటీల రాష్ట్ర అధ్యక్షుడిగా కొండమడుగుల సుధాకరరెడ్డిని నియమించారు.

Updated Date - Oct 20 , 2024 | 04:32 AM