Share News

పాల్గుణ పున్నమి గరుడసేవలో పురాణపండ శ్రీనివాస్.. వేద పండితులకు ‘శ్రీమాలిక’ అందజేత

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:44 PM

తిరుమల పాల్గుణ మాసపు పున్నమి గరుడ సేవలో పాల్గొన్న పురాణపండ శ్రీనివాస్ తన నలభై ఐదవ ఆధ్యాత్మిక రచనా సంకలనం ‘శ్రీమాలిక’ ఇరవై ఐదవ పునర్ముద్రణను ప్రధాన అర్చకుల స్థాయినుండి వేద పండితుల వరకూ పలువురు ప్రముఖులకు స్వయంగా అందజేశారు.

పాల్గుణ పున్నమి గరుడసేవలో పురాణపండ శ్రీనివాస్.. వేద పండితులకు ‘శ్రీమాలిక’ అందజేత

తిరుమల, మార్చి 28: అపురూపమైన, అత్యద్భుతమైన ఆధ్యాత్మిక సమాజాన్ని నిర్మించాలంటే.. రచయిత పురాణపండ శ్రీనివాస్‌ (Puranapanda Srinivas)లా వేల వేల మంత్ర పుష్పాల్లాంటి అఖండ గ్రంధాలతో అంతర్లోకాల్లో ప్రయాణింప చేసే భక్తి సామర్ధ్యపు వ్యక్తిత్వాలు అవసరమని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పలువురు పండిత ప్రముఖులు, అర్చక బృందాలు అభినందనలు తెలిపారు. తిరుమల పాల్గుణ మాసపు పున్నమి గరుడ సేవలో పాల్గొన్న పురాణపండ శ్రీనివాస్ తన నలభై ఐదవ ఆధ్యాత్మిక రచనా సంకలనం ‘శ్రీమాలిక’ (Sree Maalika) ఇరవై ఐదవ పునర్ముద్రణను ప్రధాన అర్చకుల స్థాయినుండి వేద పండితుల వరకూ పలువురు ప్రముఖులకు స్వయంగా అందజేశారు.

పురాణపండ శ్రీనివాస్‌తో మాట్లాడుతుంటే ఓ తాదాత్మ్యం కలుగుతుందని, సున్నితమైన పవిత్ర సాహచర్యానికి చిరునామాగా పురాణపండ సంచరిస్తారని తిరుపతిలోని విశ్వవిద్యాలయాల పరిశోధక విద్యార్థులు సైతం పేర్కొనడం గమనార్హం. గత నాల్గు సంవత్సరాలుగా పురాణపండ శ్రీనివాస్ తిరుమల పండిత సమాజానికి అందించిన ‘శరణు .. శరణు’, ‘అమ్మణ్ణి’, ‘మహా మంత్రస్య’, ‘శంకర ... శంకర’ మహా గ్రంథాలు ఎంతగా భక్తి ప్రయోజనాన్ని వర్షించాయో గరుడోత్సవం అనంతరం కొందరు పండిత అర్చక ప్రముఖులు చర్చించుకోవడం విశేషం.

Tirumala.jpg

భక్తి అంటే కేవలం భజనో, ప్రసాదమో కాదని... ఉజ్వల ఆధ్యాత్మిక ప్రాభవమని తెలుగు రాష్ట్రాలలో అవిచ్ఛిన్న ధారలా అమృతమయ విలువలతో నిస్వార్ధంగా అపురూప గ్రంథరచన, ప్రచురణ, వితరణ సాగిస్తున్న పురాణపండ శ్రీనివాస్ సహస్ర దళ పద్మంలా పరిమళిస్తున్నారని ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు, సీనియర్ ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారి పేర్కొన్న ఆనవాళ్ల వెనుక ఉన్న దైవబలంతో పీఠాధిపతులు, మఠాధిపతులు సైత పురాణపండ శ్రీనివాస్‌లోని మహా మంత్ర సరస్వతిని కొలవడం ఆశ్చర్యంగానే అనిపిస్తోందని యాదాద్రి టెంపుల్ అథారిటీ చైర్మన్, సీనియర్ ఐఏఎస్ అధికారి కిషన్ రావు పేర్కొనడం గమనార్హం.

గతంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమర్పణలో పురాణపండ రచన ‘పచ్చకర్పూరం’ గ్రంధాన్ని వేలకొలది ప్రచురించి విశ్వవిద్యాలయాల విద్యార్థులకు గత టి.టి.డి. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సౌమ్యంగా పంచిన విశేషాన్ని ఈనాటికీ ఉద్యోగ బృందాలు నెమరువేసుకుంటూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి ఆర్కే రోజా సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ రచన ‘శ్రీనివాసా విజయతే’ గ్రంధాన్ని ఇటీవల తిరుమలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించగా.. రోజా సహచర అనుచరులు పవిత్ర స్వరాలతో ఎలుగెత్తి చెప్పుకోవడం విశేషం. అలాగే ప్రఖ్యాత వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో స్వర్ణమయ వర్ణాల మంత్రభరిత గోవిందుని గ్రంధం ‘స్మరామి ... స్మరామి’ టి.టి.డిలోని వందల కొలది ఉద్యోగులతో పాటు, వేల భక్తులకు పారవశ్యాన్ని కలిగించిందనడంలో సందేహంలేదని తిరుమల ఉద్యోగులే విరామ సమయంలో ఈ గ్రంధంతో పారాయణ చేసుకోవడం కన్నులముందే కనిపిస్తోందని దేవస్థానం ఉన్నతాధికారి మీడియా ముందే ప్రశంసించడం పురాణపండ మంత్ర వ్యాఖ్యాన కర్పూర పరిమళానికి, నిస్వార్ధవకు తార్కాణంగా చెప్పబడుతోంది.

Updated Date - Mar 28 , 2024 | 11:44 PM