Share News

యుగపురుషుడు.. ఎన్టీఆర్‌

ABN , Publish Date - Jan 18 , 2024 | 10:38 PM

పార్టీ స్థాపించిన 9 నెలల వ్యవధిలోని ముఖ్యమం త్రిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నంద మూరి తారకరామారావు యుగపురుషుడని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన చిరస్మరణీయునిగా ప్రజల మదిలో ఉంటారని ఆ పార్టీ చీరాల ని యోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్యా అన్నారు. ఎన్టీఆర్‌ వ ర్ధంతి సంద ర్భంగా గురువారం పార్టీ కార్యాలయం నుంచి గడియార స్తంభం సెంటర్‌ మీదుగా బస్టాండ్‌ సెంటర్లోని ఎన్టీఆర్‌ విగ్రహం వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలువేసి నివాళులర్పించారు.

యుగపురుషుడు.. ఎన్టీఆర్‌
మేదరమెట్ల: రావినూతలలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ శ్రేణులు

పలుచోట్ల నివాళులు

భారీగా అన్నదానం, సేవాకార్యక్రమాలు

టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం

చీరాల, జనవరి 18: పార్టీ స్థాపించిన 9 నెలల వ్యవధిలోని ముఖ్యమం త్రిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నంద మూరి తారకరామారావు యుగపురుషుడని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన చిరస్మరణీయునిగా ప్రజల మదిలో ఉంటారని ఆ పార్టీ చీరాల ని యోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్యా అన్నారు. ఎన్టీఆర్‌ వ ర్ధంతి సంద ర్భంగా గురువారం పార్టీ కార్యాలయం నుంచి గడియార స్తంభం సెంటర్‌ మీదుగా బస్టాండ్‌ సెంటర్లోని ఎన్టీఆర్‌ విగ్రహం వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా డేటా నాగేశ్వరరావు అధ్య క్షతన జరిగిన సభలో కొండయ్య మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జరిగిన పాలనకు ఎన్టీఆర్‌ ఆద్యులని అన్నారు. సీఎం జగన్‌ చెప్పే మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు. తల్లి, చెల్లిని పక్కన పెట్టిన ఆ పెద్దమనిషి రాష్ట్రాన్ని ఏం ఉద్దరిస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతు న్న రాక్షస పాలనకు చరమగీతం పాడి, తిరిగి రామరాజ్యం రావాలంటే టీడీపీ గెలుపు, చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం అనివార్యమన్నారు. స భ అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నా యకులు డాక్టర్‌ పొగడదండ రవికుమార్‌, గజవల్లి శ్రీనివాసరావు, గంజి పు రుషోత్తమ్‌, నాశిక వీరభద్రయ్య, వంకా హరికృష్ణ, శ్రీనివాసతేజ, ఉసురుపా టి సురేష్‌, సయ్యద్‌బాబు, కారంపూడి పద్మిని, కర్పూరపు సుబ్బల క్ష్మి, బుర్ర కవిత, యర్రా శివనాగమల్లేశ్వరి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గూడూరి శివరామప్రసాద్‌, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చీరాల మండలం ఈపురుపాలెం, రామకృష్ణాపురం, చీరాలనగర్‌ తదితర గ్రామాల్లో ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వేటపాలెం మండలం రావూరిపేటలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఆపార్టీ చీరాల నియోజకవర్గ బాధ్యుడు ఆమంచి స్వాము లు(శ్రీనివాసరావు), టీడీపీ నాయకులు నాశిక వీరభద్రయ్య, కర్ణ శ్రీనివాస రావు, తదితరులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మార్టూరులో.. మార్టూరు, జనవరి 18: ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి వేడుకలను గురువారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఇసుకదర్శిలోని ఏలూరి క్యాంపు కార్యాలయంలో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి నాయకులు శివరాత్రి శ్రీను, శానంపూడి చిరంజీవి, షేక్‌ ఫరూక్‌, తదితరులు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అలాగే, మండల కాంప్లెక్స్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళుల ర్పించారు. మార్టూరులోని పార్టీ కార్యాలయం వద్ద తెలుగు మహిళలు ఎన్‌ టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తాటి నాగేశ్వర రావు, గొట్టిపాటి వెంకట్రావు, రావినేని శ్రీనివాసరావు, జెట్టి శివ, కామినేని జనార్దన్‌, షేక్‌ ఫరూక్‌, జంపని సాంబశివరావు, మువ్వా సాంబయ్య, తేలప్రో లు సాంబశివరావు, ఉప్పుటూరి రమాదేవి, పున్నారావు, తదితరులు పాల్గొ న్నారు. అనంతరం మార్టూరులో బొడ్డురాయి సెంటరు వద్ద కమ్మ శివ నాగే శ్వరరావు, చల్లగుండ్ల సుబ్బారావు తదితరులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహా నికి నాయకులు, తెలుగు మహిళలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానులకు అన్న సంతర్పణ చేశారు. బొబ్బేపల్లి, రాజుగారి పాలెం, ద్రోణాదుల, ఇసుకదర్శి, రాజుపాలెం, నాగరాజుపల్లి, తదితర గ్రామా లలో పార్టీ అభిమానులు ఎన్‌టీఆర్‌ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. వ లపర్ల గ్రామంలో సెంటరులో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి అన్నదా నం చేశారు. కార్యక్రమంలో కంభంపాటి హనుమంతరావు, జంజనం సుబ్బా రావు, వెలగా రామాంజనేయులు, షేక్‌ బషీర్‌, సయ్యద్‌ కరిముల్లా తదితరు లు పాల్గొన్నారు. అదేవిధంగా డేగరమూడి గ్రామంలో ఎన్‌టీఆర్‌ వర్ధంతి వేడుకలను నిర్వహించారు.

యద్దనపూడి మండలంలో యద్దనపూడి, చింతపల్లిపాడు, గన్నవరం, పూ నూరు, మున్నంగి వారిపాలెం, అనంతవరం, పోలూరు తదితర గ్రామాలలో ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల కూడలిల వద్ద ఉన్న ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాలలో కనపర్తి నాగేశ్వరరావు, నల్లపనేని రంగయ్య చౌదరి, బోయపాటి సాంబయ్య, రావినేని సీతయ్య, గుదే తారక రామారావు, కొరటాల వంశీ, కోయ సతీష్‌, పూనూరు వాసు తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌పై వెల్లువెత్తిన అభిమానం

పర్చూరు, జనవరి 18: ఎన్టీఆర్‌ 28వ వర్ధంతిని గురువారం మండలంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అడుసుమల్లి, నాగులపాలెం, చెరుకూరు, బోడవాడ, వీరన్నపాలెం, పెద్దివారిపాలెం గ్రామాల్లో ఎన్టీఆర్‌ వర్ధంతిని నిర్వహించారు. పర్చూరు బొ మ్మల సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌, పట్టణ అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణ, కోడూరి శేషబ్రహ్మాచారి, దూళ్ళిపాల్లి వెంకటస్వామి, చిట్టినేని రామకృష్ణ, మానం హరిబాబు, కొల్లా శివరాంప్రసా ద్‌, తదితరులు పాల్గొన్నారు.

కారంచేడు(పర్చూరు): స్వర్గీయ నందమూరి తారక రామరావు 28వ వర్ధంతి వేడుకలు కారంచేడు మండల కేంద్రంలో గురువారం ఘనంగా ని ర్వహించారు. స్ధానిక కాల్వసెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బారీస్థాయిలో అన్నదానం ఏర్పాటుచేశా రు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తిరుములశెట్టి శ్రీహరి, ఏ ఎంసీ మాజీ చైర్మన్‌ యార్లగడ్డ అక్కయ్యచౌదరి, కసిమ్‌, రావి శాసయ్య, రావి వీరయ్యచౌదరి, పాతూరి ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

అలాగే, కారంచేడులోని తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్వర్యంలో కాల్వసెం టర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్ర మంలో యార్లగడ్డ నాగేశ్వరరావు, జాగర్లమూడి ప్రహ్లాదరావు, మందలపు సుబ్బారావు, చాగంటి లక్ష్మీనారాయణ, చాగంటి కోటేశ్వరరావు, దగ్గుబాటి చౌ దరి, నల్లగొర్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. కుంకలమర్రు గ్రామంలో పార్టీ నాయుకులు కొల్లా సుబ్బారాయుడు, టి.బంగారుబాబు, రాఘవయ్య, రవి, శివరాం, యోహాన్‌, ప్రకాశం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇంకొల్లులో.. ఇంకొల్లు, జనవరి 18: మండలంలో ఎన్టీఆర్‌ వర్ధంతి వేడు కలు ఘనంగా నిర్వహిచారు. గంగవరం, నక్కలపాలెం, ఇడుపులపాడు గ్రా మాలలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంకొ ల్లులోని మండల పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు.అనంతరం గ్రామంలో ర్యాలీగా నాగులచెరువు కట్టవద్ద ఎన్టీఆర్‌ విగ్రహం వ ద్దకు చేరుకొని నివాళులర్పిం చారు. కార్యక్రమంలో టీడీపీ ఇంకొల్లు మండల అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు, పాలేరు రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు వలేరు మార్కు, వీరగంధం ఆంజనేయులు, చె రుకూరి రమేష్‌బాబు, చిలు కూరి శ్రీనివాసరావు, హనుమ య్య, శివయ్య, తదితరులు పా ల్గొన్నారు.

చినగంజాంలో.. చినగంజాం: స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధం తి వేడుకలను నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు పొద వీరయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడుతూ తెలుగుజాతి అ భ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. కార్య క్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్‌

అద్దంకి, జనవరి 18: ఉమ్మడి తెలుగు రాష్ర్టాలలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు నందమూరి తారకరామారావు అని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నా గినేని రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక కాకానిపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ఈసందర్భంగా నందమూరి కళాపరిషత్‌ ఆధ్వర్యంలో పేద మహిళా కళాకారిణిని సత్కరించి నూతన వస్ర్తాలు అందజేశారు. అన్నమనేని వెం కటరావు మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో ఎన్టీఆర్‌ రారాజుగా వెలుగొం దారన్నారు. కార్య క్రమంలో నందమూరి కళాపరిషత్‌ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు, తెలుగుయువత అధ్యక్షుడు వడ్డవల్లి పూర్ణచం ద్రరావు, జిల్లా టీడీపీ లీ గల్‌ సెల్‌ అద్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావు, గోరంట్ల లక్ష్మణదాసు, కాకాని అశోక్‌, కుందారపు రామారావు, భోజనపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. మండ లంలోని పలు గ్రామాలలో ఎన్టీఆర్‌ వర్దంతి కార్య క్రమాలు నిర్వహించారు. చక్రాయపాలెంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి టీడీపీ శ్రేణలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గోగులమూడి రాజశేఖర్‌, నరేంద్ర, సుబ్బారావు, సత్యం, కోటయ్య, వెంకటరావు తదితరులు పా ల్గొన్నారు.

అలాగే, అద్దంకి మండలంలోని పలు గ్రామాలలో ఎన్టీఆర్‌ వర్ధంతి సం దర్భంగా గురువారం రాత్రి ఎన్టీఆర్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాల లు వేసి నివాళులు అర్పించారు. చినకొత్తపల్లి, శ్రీనివాసనగర్‌, తిమ్మాయపా లెంలో ఎన్టీఆర్‌ చిత్రపటం, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. తిమ్మాయపాలెంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. టీడీ పీ నేతలు మానం మురళీమోహన్‌దాస్‌, బండారు రాఘవ, గణపతి, నూతి ప్రసాద్‌, అడుసుమల్లి శ్రీనివాసరావు, పరిటాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంతమాగులూరు: నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి మండ లంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పుట్టావారిపాలెం అడ్డరో డ్డు, కామేపల్లి, వెల్లలచెరువు, ఏల్చూరు, కొమ్మాలపాడు, మామిళ్ళపల్లి, కుం దుర్రు, పరిటాలవారిపాలెం, మక్కెనవారిపాలెం, సజ్జాపురం, కొప్పరం, బండి వారిపాలెం, పత్తేపురం, మిన్నెకల్లు, తంగేడుమల్లి, చవిటిపాలెం, గురిజేపల్లి, పాతమాగులూరు, సంతమాగులూరు గ్రామాలలో ఎన్టీఆర్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

బల్లికురవలో.. బల్లికురవ, జనవరి18: మండలంలోని పలు గ్రామాలలో గుర ువారం ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. బల్లికురవ, నక్క బొక్కలపాడు, ఉప్పమాగులూరు, వల్లాపల్లి, కొమ్మినేనివారిపాలెం, గొర్రెపా డు, గంగపాలెం, కొప్పెరపాలెం తదితర గ్రామాలలో ఎన్టీఆర్‌ విగ్రహాలకు టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మం డల పార్టీ నేతలు కొండేటి ఇజ్రాయిల్‌, మలినేని గోవిందరావు, అమరనేని కాశీవశ్వనాధం, పరుసు ప్రసాద్‌, చింతల రామారావు, పత్తిపాటి వెంకట రావు, ఏల్చూరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

పంగులూరులో.. పంగులూరు: ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలు గురువారం మండలంలో ఘనంగా నిర్వహించారు. జాగర్లమూడివారిపాలెం, పంగులూ రు, కొండమంజులూరు, చందలూరు తదితర గ్రామాలలో ఎన్‌టీఆర్‌ విగ్ర హాలకు పూలమాలలు నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రావూ రి రమేష్‌,చౌదరి బాబు, జాగర్లమూడి వెంకట్రావు, శ్రీకాంత్‌, జాగర్లమూడి పూర్ణచంద్రరావు, తెలగతోటి రాధ, తదితరులు పాల్గొన్నారు.

మేదరమెట్లలో.. మేదరమెట్ల: ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలు మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. గురువారం మేదరమెట్లలో ఎన్టీఆర్‌ దంపతుల చిత్రపటానికి టీడీపీ జిల్లా ఉపాధ్యాక్షుడు మన్నె రామారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కర్నాటి పూర్ణచంద్రరావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ బొల్ల్లేపల్లి సుబ్బారావు, శేషయ్య తదితరులు కూడా నివాళులర్పించారు. దాదాపు 4 వేలకు మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మండలంలోని రావినూతలలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళుర్పించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కారుసాల నాగేశ్వరరావు(బాబు) , మోపర్తి లక్ష్మీనారాయణ, కారుసాల గురుబాబు, కారుసాల సుబ్బయ్య, అనుబ్రోలు కస్తూరి, తదితరు లు పాల్గొన్నారు. పమిడిపాడు శివారు కనగాలవారిపాలెంలో మండల పార్టీ అధ్యక్షుడు జాగర్లమూడి జయకృష్ణ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Jan 18 , 2024 | 10:39 PM