Share News

అద్దంకి, పర్చూరు, చీరాల్లో వైసీపీ విలవిల

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:50 PM

ఇటు వలసలు, అటు అలకలు.. మరో వైపు తిరుగుబాట్ల సమస్యలతో వైసీపీ అభ్యర్థులకు తలబొప్పికడుతోంది. మరోవైపు ప్రచార రంగంలో చొ చ్చుకుపోతూ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తు న్న టీడీపీ అభ్యర్థుల దూకుడుతో అధికార వైసీపీ విలవిలలాడుతోందంటే అతిశయోక్తి కాదు. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పర్చూరు, అద్దంకి, చీరాల్లో ప్రధానంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనా కూడా మూడు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితులు చక్కబడకపోగా సమస్యలకు పరిష్కారం లభించక ఆ పార్టీ అభ్యర్థులు విలవిలలాడుతున్నారు.

అద్దంకి, పర్చూరు, చీరాల్లో వైసీపీ విలవిల

వలసలు.. అలకలు.. తిరుగుబాటులు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఇటు వలసలు, అటు అలకలు.. మరో వైపు తిరుగుబాట్ల సమస్యలతో వైసీపీ అభ్యర్థులకు తలబొప్పికడుతోంది. మరోవైపు ప్రచార రంగంలో చొ చ్చుకుపోతూ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తు న్న టీడీపీ అభ్యర్థుల దూకుడుతో అధికార వైసీపీ విలవిలలాడుతోందంటే అతిశయోక్తి కాదు. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పర్చూరు, అద్దంకి, చీరాల్లో ప్రధానంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనా కూడా మూడు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితులు చక్కబడకపోగా సమస్యలకు పరిష్కారం లభించక ఆ పార్టీ అభ్యర్థులు విలవిలలాడుతున్నారు.

అద్దంకిలో : అద్దంకి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను తిరిగి టీడీపీ రంగంలో దింపింది. నియోజక వర్గంలో ఊరూవాడా ప్రజలందరితో అపారమైన పరిచయాలు కల్గిఉండటం ఆయన ప్రత్యేకత. పైగా వైసీపీ ప్రభుత్వం రవికుమార్‌పై కక్ష కట్టి వేధింపులకు గురిచేసింది. ఆర్థిక వనరులను దెబ్బతీసింది. రవికుమార్‌ వాటన్నింటినీ ఎదుర్కొని ఈ ఐదేళ్ళ కాలంలో ఏనాడు ప్రజలను వీడకుండా ముందడుగు వేశారు. వైసీపీ తరఫున నాలుగేళ్లుగా ఇన్‌చార్జిగా ఉన్న బాచిన కృష్ణచైతన్య ను ఆ పార్టీ కాదు పొమ్మంది. ఆ నియోజకవర్గం లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కృష్ణచైతన్య తండ్రి మాజీ ఎమ్మెల్యే గరటయ్యకు ఉన్న పలుకుబడిని కూడా వైసీపీ తోసిపుచ్చింది. కష్టకాలంలో అండగా ఉన్నవారిని కాదనటంతో తండ్రీ కొడుకులు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. అదే సమయంలో వైసీపీ అధిష్ఠానం జిల్లాయేతర వ్యక్తి హనిమిరెడ్డిని రంగంలో పెట్టి మరో తప్పటడుగు వేసింది. ఈ నేపథ్యంలో తిరిగి రవికుమార్‌ గెలుపుబావుటాగా పయనిస్తున్న తీరు ఆయనపై వ్యక్తిగత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా టీడీపీలో చేరటం ప్రారంభించారు. వార్డు, గ్రామ, మండలస్థాయిలో పదవులతో పాటు వైసీపీలో పదవులున్న అనేక మంది టీడీపీలో చేరటం విశేషం. చేరికలు అన్ని సా మాజిక వర్గాల నుంచి జరుగుతున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు దృష్టిలో పెట్టుకొని వైసీపీ హనిమిరెడ్డిని రం గంలో తీసుకు రాగా ఆ సామాజిక వర్గా నికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరేందుకు ముందుగా శ్రీకారం పలకటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ వలసల నివారణకు వైసీపీ చేసిన ఎత్తుగడలు ఫలించలేదు. దీంతో దొంగోట్లు చేర్చుకునేందుకు అందునా పక్క జిల్లా వ్యక్తులను అద్దంకి ఓటర్లుగా చేర్చే ప్రయత్నాలు చేశారు. ఎన్నికల నిర్వాహణలో అపారమైన అనుభవంతో పాటు అనునిత్యం పరిస్థితులను సమన్వయం చేసుకునే సమర్థత ఉన్న రవికుమార్‌ ఆ ప్రయత్నాలకు కొంత బ్రేక్‌ వేశారు. దీంతో పోలీస్‌ యంత్రాంగంతో బెదిరింపు ధోరణులకు శ్రీకారం పలికారు. బల్లికురవ ఎస్సై చేసిన కొన్ని దూకుడు చర్యలు, మేదరమెట్లలో చీరాల డీఎస్పీ ఆద్వర్యంలో జరిగిన దాడులను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయినా టీడీపీ కార్యకర్తలు బెదకపోగా చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు. ఎన్నికల సమయం కావటంతో స్థానిక పోలీసులకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణమైన హెచ్చరికలు జారీ కావటంతో వెనుకడుగు వేయక తప్పలేదు. కలిసిరాని పరిస్థితులతో ఎదురేగుతూ వలసల నివారణకే వైసీపీ అభ్యర్థి నాయకత్వం ప్రధాన్యత ఇస్తుంది. అందుకు అనుగుణంగా డబ్బే ఆయుధంగా చేసుకొని నివారణకు దిగగా అక్కడ సానుకూలత లభించలేదు. మాటలు కోటలు దాటినా డబ్బులపై పెట్టిన ఆశలు చేతల రూపంలో కనిపించక ఎదురుదాడి ప్రారంభమైంది. ది క్కుతోచని పరిస్థితిలో వైసీపీ అభ్యర్థి కొట్టుమిట్టాడుతుండగా టీడీపీ అభ్యర్థి రవికుమార్‌ చాపకింద నీరులా ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో కూడా తనకున్న అనుభవాన్ని రంగరించుకొని రవికుమార్‌ ముందడుగు వేస్తున్నాడు.

ఏలూరి వ్యూహాత్మక అడుగులతో వైసీపీ బెంబేలు

పర్చూరులో కూడా వరుసగా రెండుసార్లు జయకేతనం ఎగురవేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును తిరిగి టీడీపీ రంగంలో దింపింది. గత ఎన్నికల్లో విజయం సాధించిన ఏలూరికి నియోజకవర్గంలో అణువణువూ ఉన్న పట్టు, పరిచయాలు కలిసివస్తున్నాయి. ఆరంభంలోనే పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను అధ్యయనం చేసిన ఏలూరి గత 15 ఏళ్లుగా ప్రజాసంబంధాలను వీడకుండా ముందుకు సాగుతున్నారు. పార్టీ అధికారంలో లేకున్నా తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా ముమ్మరంగా వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యకర్త నుంచి సాధారణ ప్రజల వరకు తాను ఇబ్బందుల్లో ఉన్నానని ఎవరు అన్నా నేనున్నానంటూ చేయూతనిచ్చారు. అదే ప్రజాబలంతో ఆయన రంగంలో రాగా వైసీపీ ధీటైన అభ్యర్థి కోసం అంటూ గాలింపుతో అనేక ప్రయోగాలు చేసింది. పోటీకి ముందుకు వచ్చిన ఆమంచి పరిస్ధ్థితులను గమనించి చివరకు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఎక్కడెక్కడ నుంచో ఆర్థికంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి తేవాలని వైసీపీ ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వైసీపీని చీకొట్టి జగన్‌ను నమ్మకూడదని ప్రకటించి గత ఎన్నికల్లో వైసీపీకి దూరమైన చీరాలకు చెందిన యడం బాలాజీని రంగంలో దించింది. అందునా ఎక్కడో అమెరికాలో ఉన్న ఆయన్ను హడావుడిగా పిలిపించి పోటీకి పంపారు. అప్పటికే గ్రూపుగా విడిపోయిన వైసీపీ నాయకత్వం అధిష్ఠానం నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపొయింది. స్థానిక పరిస్ధితులు ఏలూరి రూపంలో ఉన్న బలమైన నాయకత్వం గెలుపు వైపు పయనిస్తున్న టీడీపీని గమనించిన వైసీపీ నేతలు పొలోమని టీడీపీలో చేరటం ప్రారంభించారు. వైసీపీ ఎత్తుగడ విఫలమై కాపు వర్గానికి చెందిన ఆ పార్టీ శ్రేణులు పోటీపడి మరీ టీడీపీలో చేరారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చిన్నగంజాం మండలంలోని ఆ పార్టీ నాయకత్వం మొత్తం సైకిలెక్కింది. మార్టూరులో ముస్లిం మైనార్టీలు, యద్దనపూడి, పర్చూరులో దళిత సామాజిక వర్గాల వారు, కోనంకి, రాజుపాలెం మొదలుకొని ఇంకొల్లు, కారంచేడు మండలాల్లో బలహీన వర్గాలు, కమ్మసామాజిక వర్గం వారు చిన్నగంజాం మండలంలో బలహీన వర్గాలకు చెందిన దళిత సామాజిక వర్గం వారు ఇలా అన్నీ వర్గాల్లోని ఆ పార్టీ శ్రేణులు టీడీపీలో చేరిపోయారు. వ్యూహాత్మంగా పయనిస్తున్న ఏలూరి పాత, కొత్త వారిని సమన్వయం చేసుకోవటంలో సఫలీకృతులయ్యారు. అందుకు మచ్చుతునకగా చిన్నగంజాం, మార్టూరు మండలాల్లో జరిగిన చేరికలను ఊదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకొల్లు మండలంలో టీడీపీ నాయకుల మధ్య ఉన్న స్వల్ప విభేదాలను దృష్టిలో ఉంచుకొని ఒక వర్గాన్ని దరి చేర్చుకునేందుకు వైసీపీ కుటిల ప్రయత్నాలు చేసింది కానీ ఏలూరి వ్యూహం ఆ పార్టీ నాయకులు, శ్రేణుల్లో ఉన్న టీడీపీ పట్ల అభిమానంతో వైసీపీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. వలసల నివారణ ప్రయత్నం విఫలం కావటంతో అలకబూనిన వైసీపీ నాయకులను దరిచేర్చుకునేందుకు వైసీపీ దిగింది. ఇంకొల్లు మండలంలో ఆ పార్టీ నాయకుడిపై ఉన్న పార్టీ సస్పెన్షన్‌ ఎత్తి వేయించారు. కాని కిందిస్ధాయి సమస్యలకు పరిష్కారం చూపలేకపోవటంతో ఫలించలేదు. కారంచేడు మండలంలో ప్రలోబాలే ఆయుధంగా అలకబూనిన నాయకులను దరిచేర్చుకునే ప్రయత్నంలో వైసీపీ నేతలు మునిగిపోయారు. వైసీపీ అభ్యర్థి బాలాజీ ఒంటెత్తు పోకడ విధానాలు వారి ప్రయత్నాలను బెడసికొడుతున్నాయి. ఇప్పటికీ వైసీపీ అభ్యర్థి ప్రచారం కన్నా వలసలు, అలకల నివారణ జరక్క ప్రచారం వైపు కూడా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇటు చూస్తే టీడీపీ అభ్యర్థి ప్రచార కార్యక్రమం ఊరూవాడా మారుమోగుతోంది. పోలింగ్‌ కేంద్రాల వారీ పోలింగ్‌ మేనేజ్‌మెంట్‌ను ఆయన చక్కబెట్టుకొని సమరానికి సిద్ధమై సోమవారం నామినేషన్‌ వేస్తున్నారు.

చీరాలలో : చీరాలలో ఎమ్మెల్యే బలరాం కుమారుడిని వైసీపీ రంగంలో దించగా ఆ నియోజకవర్గ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ బలహీన వర్గాలకు చెందిన కొండయ్యయాదవ్‌ను రంగంలో దించింది. దీం తో ఆయా సామాజిక వర్గాల ప్రజల ఆలోచన ధోరణి టీడీపీ వైపు మారుతున్న తీరు ప్ర స్ఫుటం అవుతోంది. దీనికి తోడు మాజీ ఎమ్మె ల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కాంగ్రెస్‌ పక్షాల రంగంలోకి వచ్చేందుకు సిద్ధమై ప్రచారం ప్రారంభించారు. వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే బలరాంను కట్టడి చేయటమే ఆమంచి వ్యూహంగా కనిపిస్తుంది. ఈ నాలుగేళ్లల్లో ఆయన చేసిన వివి ధ రకాల కార్యక్రమాలు, వాక్యాలు ప్రసుత్తం తమ మద్దతుదారులకు చెబుతున్న విషయాలు ఆయన విధానాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. అపారమైన రాజకీయ అనుభవంతో వైసీపీ అభ్యర్థి వెంకటేష్‌ పక్షాన ప్రచార పర్వం ప్రారంభమైనప్పటికీ ఆమం చి రూపంలో ఎదురవుతున్న సమస్య ఏరూపంలో ఎంతమేరకు దెబ్బ తీస్తుందనేది సమస్యగా మారిం ది. ఆ ఇద్దరి మద్య టీడీపీ అభ్యర్థి తెలుగుదేశం కూటమి బలానికి తోడు బలహీన వర్గాల తరఫున సౌమ్యుడిగా ఎలా ముందుకు పోగలనో చెప్పుకుంటూ ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు.

ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న తాజా పరిస్థితులతో వైసీపీ విలవిలలాడుతోంది. పరిస్థితులను సవరించేందుకు కొన్నిచోట్ల వైసీపీకి చెందిన అధినాయకుల జోక్యం చేసుకున్నా సానుకూల మార్పులు కనిపించలేదు. దీంతో రానున్న రోజుల్లో వైసీపీ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Updated Date - Apr 18 , 2024 | 11:50 PM