Share News

చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలరు

ABN , Publish Date - May 20 , 2024 | 10:28 PM

విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకుని ఇష్టమైన రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవరాలు సుభాషిణి అన్నారు. సోమవారం అద్దంకిలోని ప్రకాశం మిత్రమండలి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకా శం పంతులు 67వ వర్ధంతి కార్యక్రమం స్థానిక శ్రీనివాస కల్యాణ మం డపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమరాలు సుభాషిణి హాజరయ్యారు. ముందుగా బంగ్లారోడ్డులోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూల మా లలు వేసి నివాళులర్పించారు.

చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలరు
టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుతులు అందజేస్తున్న ప్రకాశం మిత్రమండలి సభ్యులు

ప్రకాశం పంతులు మునిమనవరాలు

టంగుటూరికి ఘనంగా నివాళి

అద్దంకిటౌన్‌, మే 20 : విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకుని ఇష్టమైన రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవరాలు సుభాషిణి అన్నారు. సోమవారం అద్దంకిలోని ప్రకాశం మిత్రమండలి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకా శం పంతులు 67వ వర్ధంతి కార్యక్రమం స్థానిక శ్రీనివాస కల్యాణ మం డపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమరాలు సుభాషిణి హాజరయ్యారు. ముందుగా బంగ్లారోడ్డులోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూల మా లలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకావం పంతులు సేవలను పలువురు సభ్యులు కొనియడారు. అనంతరం శ్రీనివాస కల్యాణ మండపంలో అద్దంకి మండలంలో పదివ తరగతిలో 550కి పైగా మార్కులు వచ్చిన విద్యార్థినీవిద్యార్థులకు నగదు బహుమతితోపాటు సర్టిఫికెట్‌లను అందజేశారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె ఆకాక్షించారు. ఊటుకూరి కృష్ణసుభాన్‌, రావూరి రంగయ్య సౌజన్యంతో 31 మంది విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. అ లాగే మిగిలనవారికి బహుమతులను, వివిధ రకాల పుస్తకాలను అందజేశారు. ఈ క్రమంలో ఆత్మీయ అతిథిగా ఉటుకూరి ఉమ అన్నపూర్ణ, వీరవల్లి రుద్రయ్య, దివాకర్‌ దత్తు, జ్వోతిష్మతి, మహమ్మద్‌ రఫీ, ఇలపావులూరి శేషతల్పసాయి, కోశాధికారి ఉటూకూరి రామకోటేశ్వరావు, తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 10:28 PM