Share News

పింఛన్ల పంపిణీపై వైసీపీ అబద్ధాలు

ABN , Publish Date - Apr 03 , 2024 | 10:23 PM

రాజకీయ లబ్ధి కోసమే పింఛన్ల పంపిణీని వైసీపీ ప్రభుత్వం జాప్యం చేసిందని టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. బుధవారం మండలంలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంప్‌ కార్యాలయంలో మార్టూరు, యద్దనపూడి మండలాల క్లస్టర్లతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి ఏలూరి వారికి దిశానిర్దేశం చేశారు.

పింఛన్ల పంపిణీపై వైసీపీ అబద్ధాలు
పూనూరు క్లస్టర్‌ యూనిట్‌ సభ్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి

జగన్‌రెడ్డిని ఇంటికి పంపేందుకు జనం సిద్ధం

ఎమ్మెల్యే ఏలూరి

మార్టూరు, ఏప్రిల్‌ 3 : రాజకీయ లబ్ధి కోసమే పింఛన్ల పంపిణీని వైసీపీ ప్రభుత్వం జాప్యం చేసిందని టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. బుధవారం మండలంలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంప్‌ కార్యాలయంలో మార్టూరు, యద్దనపూడి మండలాల క్లస్టర్లతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి ఏలూరి వారికి దిశానిర్దేశం చేశారు. పింఛన్‌లను సకాలంలో అందజేయకుండా వైసీపీ రాజకీయ డ్రామా ఆడుతోందన్నారు. వైసీపీ పాలనలో సాగించిన అక్రమాలను కూకటివేళ్లతో పెకిలించడానికి, జగన్‌రెడ్డిని ఇంటికి సాగనంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారని ఏలూరి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ చేపట్టే సంక్షేమ పథకాలను ప్రచారం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కష్టాలు తీర్చేందుకు కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు ఇప్పటికే మనస్సులో నిర్ణయించుకున్నారని ఏలూరి అన్నారు. పేదరిక నిర్మూలన, అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు సూపర్‌సిక్స్‌ పథకాలను మేనిఫెట్టోలో పొందుపరిచారన్నారు. వా టిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీదేనన్నారు. మరో 45 రోజులలో జగన్‌రెడ్డి పార్టీ గాలికి కొట్టుకుపోతుందన్నారు. సమావేశంలో గుదే తారక రామారావు, బోయపాటి సాంబయ్య, రంగయ్య చౌదరి, అనిల్‌ పాల్గొన్నారు.

గ్రామాలలో పర్య టించిన ఏలూరి

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుధవారం మం డలంలోని రాజుపాలెం, కోలలపూడి, తాటి వారిపాలెం గ్రామాలలో పర్యటించారు. రాజుపాలెం గ్రామంలో అ డుసుమల్లి నాగ శ్రీహర్ష, ఎంపీటీసీ మాజీ సభ్యుడు అడుసుమల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అనంతరం కోలలపూడి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు తాటి నాగేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు తాటి నాగార్జున, కందిమళ్ల కొండలరావు తదితరుల పర్యవేక్షణలో ఏలూరి ఇంటింటికీ తిరిగి ప్ర చారం నిర్వహించారు. తాటివారిపాలెంలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మాజీ సర్పంచ్‌ వజ్జా వీరాంజనేయులను ఏలూరి పరామర్శించారు.

Updated Date - Apr 03 , 2024 | 10:23 PM