Share News

పేదల ఇళ్ళ స్థలాల పేరుతో వైసీపీ నేతల ఆటలు

ABN , Publish Date - Feb 13 , 2024 | 10:07 PM

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారపార్టీ నేతలు ఓట్ల కు గాలం వేసే తంతులకు తెరలేపుతున్నారు. ఐదేళ్ళు గుర్తుకు రాని నిరుపేదలు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా ఇళ్ళ స్థలాల కోసం అంటూ అద్దంకి కొండపై హడావుడి చేస్తున్నారు. మండలంలోని శింగరకొండపాలెంకు చెందిన ఎస్టీ, ఇతర సామాజికవర్గాల ప్రజలు అద్దంకి కొండను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.

పేదల ఇళ్ళ స్థలాల పేరుతో వైసీపీ నేతల ఆటలు
అద్దంకి కొండ పై ఇళ్ళ స్తలాల కోసం చదును చేస్తున్న ఎస్కకవేటర్‌

- పట్టాలు ఇచ్చిన చోట ఖాళీ చేయించి జగనన్న కాలనీ లేఅవుట్‌

- అక్కడ ఇవ్వకుండా.... ట్రైబల్‌ వెల్పేర్‌ స్కూల్‌ కోసం ప్రతిపాదనలు పంపిన చోట చదును

- ఓట్లకు గాలం వేసేందుకు తంటాలు

అద్దంకి, ఫిబ్రవరి13: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారపార్టీ నేతలు ఓట్ల కు గాలం వేసే తంతులకు తెరలేపుతున్నారు. ఐదేళ్ళు గుర్తుకు రాని నిరుపేదలు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా ఇళ్ళ స్థలాల కోసం అంటూ అద్దంకి కొండపై హడావుడి చేస్తున్నారు. మండలంలోని శింగరకొండపాలెంకు చెందిన ఎస్టీ, ఇతర సామాజికవర్గాల ప్రజలు అద్దంకి కొండను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే, 220 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు సమయంలో కొంతమంది ఎస్సీలకు చెందిన స్థలాలు, నివాస గృహాలని బలవంతంగా ఖాళీ చేయించి పక్కనే ఉన్న ఖాళీ స్థలం చూపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శింగరకొండపాలెంలో జగనన్న కాలనీ లేఅవుట్‌, సచివాలయం, రైతు భరోసా కేంద్రాల కోసం అంటూ అక్కడ ఉన్న పేదలను ఖాళీ చేయించారు. కనీసం జగనన్న కాలనీ లేఅ వుట్‌లో స్థలాలు కోల్పోయిన వాళ్లకు కేటాయిస్తారని భావించారు. అయితే, వాళ్ళకు మొండిచేయి చూపించి వేరే లబ్ధిదారులకు కేటాయించారు. వేరేప్రాంతంలో కేటాయింప చేస్తామని నమ్మబలికారు. ఇప్పటివరకు వాళ్ళ స్థలాల గురించి పట్టించుకోకుండా వదిలివేసి ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓట్లకు ఎర వేసేందుకు అధికారపార్టీ నేతలు పన్నాగం పన్నినట్లు తెలుస్తుంది. ఈక్రమంలో ట్రైబల్‌ వెల్పేర్‌ స్కూల్‌ ఏర్పాటుకోసం ప్రతిపాదనలు పంపిన స్థలాన్ని చూపించి చదును చేయించే పనిలో నిమగ్నమయ్యారు. అన్నీ విషయాలు తెలిసీ కూడా అధికార పార్టీ నేతలు ఆ స్థలాన్ని చదును చేయించటం పట్ల విమర్శలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న వీఆర్వో బాషా మంగళవారం సాయంత్రం చదును చే యించే పనులు నిలిపి వేయించారు.

Updated Date - Feb 13 , 2024 | 10:07 PM