Share News

భోగి మంటల్లో వైసీపీ చీకటి జీవోలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:19 PM

రాష్ట్రానికి పట్టిన జగన్‌ లాంటి కీడును ప్రజలందరూ ఏకమై తరిమి కొట్టాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్‌లో ఆదివారం వేకువజామున భోగి మంటల్లో జగన్‌రెడ్డి చీకటి జీవోలను, ఎఫ్‌ఐఆర్‌ కాపీలను తగులబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్ర మా ట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. వైసీపీ పాలన లో అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక కష్టాలు పడుతున్నారన్నారు.

భోగి మంటల్లో వైసీపీ చీకటి జీవోలు
వైసీపీ చీకటి జీవోలను భోగి మంటల్లో వేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఉగ్ర

జగన్‌రెడ్డి కీడును తరమికొట్టాలి

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర పిలుపు

ప్రజావ్యతిరేక కాపీలను తగులబెట్టి నిరసన

కనిగిరి, జనవరి 14: రాష్ట్రానికి పట్టిన జగన్‌ లాంటి కీడును ప్రజలందరూ ఏకమై తరిమి కొట్టాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. అమరావతి గ్రౌండ్స్‌లో ఆదివారం వేకువజామున భోగి మంటల్లో జగన్‌రెడ్డి చీకటి జీవోలను, ఎఫ్‌ఐఆర్‌ కాపీలను తగులబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్ర మా ట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. వైసీపీ పాలన లో అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక కష్టాలు పడుతున్నారన్నారు. మరోప క్క ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లనూ జగన్‌రెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నిక ల్లో జగన్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పి గద్దె దింపాలని ఉగ్ర పిలుపునిచ్చా రు. తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇవ్వడం రాష్ట్ర ప్రజల బాధ్యత గా భావించాలన్నారు. జగన్‌రెడ్డి అబద్ధపు, మోసపూరిత హామీలను నమ్మొద్దని సూచించారు. చంద్రబాబు పాలనలో ఏటా సంక్రాంతి కా నుకలను అందిస్తే, వైసీపీ పాలనలో ప్రతి ఏటా ఏదో ఉద్యోగ, కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి రాష్ట్ర భవిష్యత్‌ కోసం, కులాలకు, మతాలకు అతీతంగా టీడీపీని గెలిపించి, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది సంక్రాంతి నుంచి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని ఉగ్ర ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాయం తిరుపతిరెడ్డి, చావలి వెంకటేశ్వర్లుయాదవ్‌, సిద్ధాంతి బారాయిమాం, గండికోట రమేష్‌, చిలకపాటి లక్ష్మయ్య, షరీఫ్‌, కుంచెం జక్రయ్య, తెలుగు మహిళలు కరణం అరుణ పాల్గొన్నారు.

పామూరు, జనవరి 14 : ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్న వైసీపీపై నిరసన తెలుపుతున్న ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా జీవోలు చేయడం దుర్మార్గమని టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో భోగి వేడుకలను ఆదివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి సూచన మేరకు వైసీపీ అరాచక, ప్రజా వ్యతిరేక జీవో ప్రతులను పువ్వాడి కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం కట్టబెట్టి, ఉగ్రను భారీ మెజారిటీతో గెలిపించుకొని కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, తద్వారా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పువ్వాడి పిలుపునిచ్చారు. సుబ్బక్కపల్లి, బొట్లగూడూరు, కంభాలదిన్నె, మోపాడు, కోడిగుంపుల, బోడవాడ. పడమటకట్టకిందపల్లి, పుట్టంనాయుడుపల్లి, అయ్యవారిపల్లి తదితర గ్రామాలతో పాటు పట్టణంలో టీడీపీ నాయకులు వైసీపీ జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ పువ్వాడి తిరుపతమ్మ, పువ్వాడి వెంకలక్ష్మమ్మ, పువ్వాడి వెంకటేశ్వర్లు, సుజాత, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బొల్లా మహాలక్ష్మమ్మ, ఎం.హుసేన్‌రావువుయాదవ్‌, ఎంపీటీసీ సభ్యుడు బొల్లా నరసింహారావు, టీఎన్‌ఎ్‌సవీ జిల్లా మాజీ కార్యదర్శి పోకా నాయుడుబాబు, టీడీపీ విభిన్న ప్రతిభావంతుల కమిటీ రాష్ట్ర కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఎం.గంగరాజుయాదవ్‌, యారవ శ్రీనివాసులు, పువ్వాడి రామారావు, తెలుగు రైతు మండల అధ్యక్షుడు మన్నం రమణయ్య, తెలుగుయువత అధ్యక్షుడు ఉప్పలపాటి హరిబాబు, ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ మార్నేని రామకృష్ణ, దేవరపు మాల్యాద్రి, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దొనకొండ : సైకో జగన్‌ పాలన పై ప్రజలు విసిగిపోయారని ఎన్నికలు ఎ ప్పుడు జరిగినా టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి, మల్లంపేట మాజీ సర్పంచ్‌ వల్లపునేని వెంకటస్వామి తెలిపారు. భోగి పండుగ సందర్భంగా గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ ప్రజా వ్యతిరేక జీవో ప్రతులను, జగన్‌ చేతగాని హా మీలకు సంబంధించిన ప్రతులను వేసి వైసీపీ విడుదల చేసిన ప్రజా వ్యతిరేక జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి తగులబెట్టి నిరసన తెలిపారు. అనంతరం గ్రా మ పార్టీ అధ్యక్షుడు వల్లపునేని వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు ఉన్నం శ్రీను, కుందేటి వెం కటేశ్వర్లు, గుమ్మా వెంకటేశ్వర్లు మరికొందరు కార్యకర్తలు సైకో పోవాలి సైకిల్‌ రావాలి అం టూ గ్రామంలో నినాదాలు చేశారు.

తాళ్లూరు : వైసీపీ చీకటి జీవోలను టీడీపీ నాయకులు భోగి మంటల్లో వేశారు. టీడీపీ మండలాధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తురకపాలెంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాగంబొట్లపాలెంలో టీడీపీ బీసీ నేతలు పాశం సూరిబాబు, పిన్నిక రమే్‌షబాబు, శ్రేణులు భోగి మంటల్లో ప్రజావ్యతిరేక కాపీలను వేసి కాల్చివేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చంద్రగిరి గుర్వారెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 11:19 PM