Share News

అసత్య ప్రచారంతో ముస్లింలను భయపెడుతున్న వైసీపీ

ABN , Publish Date - Apr 25 , 2024 | 10:47 PM

ఎన్నికలలో వైసీపీ ఓట మి తప్పదని గ్రహించి, ముస్లింలను మభ్యపెట్టడానికి, భయపెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఎన్నికల ప్ర చారంలో భాగంగా గురువారం రాత్రి అద్దంకి పట్టణంలోని 19వ వార్డులో గొట్టిపాటి రవికుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇం టింటికి తిరిగి సూపర్‌సిక్స్‌ ద్వారా ప్రజలకు జరి గే లబ్ధిని వివరించారు.

అసత్య ప్రచారంతో ముస్లింలను భయపెడుతున్న వైసీపీ
ముస్లింలతో కలిసి నమాజ్‌ చేస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఎన్టీయేలో టీడీపీ ఉన్నా మైనారిటీల రక్షణ బాధ్యత మాదే

పట్టణవాసుల దాహార్తి తీరుస్తా

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి

అద్దంకి, ఏప్రిల్‌ 25 : ఎన్నికలలో వైసీపీ ఓట మి తప్పదని గ్రహించి, ముస్లింలను మభ్యపెట్టడానికి, భయపెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఎన్నికల ప్ర చారంలో భాగంగా గురువారం రాత్రి అద్దంకి పట్టణంలోని 19వ వార్డులో గొట్టిపాటి రవికుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇం టింటికి తిరిగి సూపర్‌సిక్స్‌ ద్వారా ప్రజలకు జరి గే లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా గొ ట్టిపాటి మాట్లాడుతూ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లింలు, క్రిస్టియన్‌లు నష్టం ఉంటుందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేతోతో ఉన్నప్పటికీ మీకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చంద్రబాబు చూస్తారని భరోసా ఇచ్చారు. గతంలో ఎన్డీయేతో టీడీపీ క లిసి ఉన్నప్పుడు ముస్లింల రక్షణ, సంక్షేమం వి షయంలో చంద్రబాబు తీసుకున్న చర్యలను గొట్టిపాటి గుర్తు చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ అన్ని వర్గాల ప్రజల్లో భయాలను, లేని పోని అనుమానాలను రేపుతోందన్నారు. విజ్ఞత తో ఆలోచించి వైసీపీ కుట్రలను తిప్పికొ ట్టాల న్నారు. ఐదేళ్లూ ముస్లింలను పట్టించుకోని జగ న్‌రెడ్డికి ఇప్పుడు గుర్తుకు రావడం ఆశ్చర్య మే స్తోందన్నారు. ముస్లింలపై దాడులు, దౌర్జన్యా లు, ఆస్తి నష్టాలు చేసిన వైసీపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. చంద్రబాబునా అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం జరుగుతుందని, అందరితోపాటు ముస్లింలకు మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువు రు మహిళలు డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, పారిశుధ్య పనులు అంతంత మా త్రంగా ఉన్నాయని, తాగునీటి సమస్య అధికం గా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కరిస్తానన్నారు. అ నంతరం ముస్లింలతో కలిసి మసీదులో నమా జ్‌ చేశారు. ముస్లింల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎమ్మెల్యే రవికుమార్‌ను పెద్దసం ఖ్యలో ముస్లిం లు సాదరంగా ఆహ్వానించారు. కార్య క్రమంలో కౌన్సిలర్‌ యేజెండ్ల నాగరాజు, దామా సురేం ద్ర, దామా హనుమంతరావు, ముస్లిం నేతలు మదీనా, మాబు, మాలిక్‌, చిట్యాల శ్రీను, ఆ కుల కోటేశ్వరరావు, ఇక్కుర్తి శ్రీను, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధాప్య పింఛన్‌ రూ.4వేలు ... బాబీ ఇంటింటి ప్రచారం

బల్లికురవ, ఏప్రిల్‌ 25 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మెదటి నెల నుంచి వృద్ధులకు రూ.4వేల పింఛన్‌ అందిస్తామని యువ నేత గొట్టిపాటి కమల్‌ కిషోర్‌ (బాబీ) తెలిపారు. గురువారం మండలంలోని భూషావారిపాలెం, రామాంజనేయపురం గ్రామాలలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌కు మద్దతుగా కమల్‌కిషోర్‌ ప్రచారం నిర్వహించారు. అయన ఇంటింటికీ తిరిగి సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలతోపాటు పింఛన్‌ అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ గొట్టిపాటి చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను సైకిల్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని బాబీ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మారాబత్తిన అంజనేయులు, కొండేటి ఇజ్రాయల్‌, మంగారావు, బాలయ్య, కమతం శ్రీను, కుంచాల వెంకట్రావు, దాసు, అట్లూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 10:47 PM