Share News

ప్రజా సమస్యలను గాలికొదిలిన వైసీపీ

ABN , Publish Date - Feb 07 , 2024 | 01:17 AM

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలిందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గుడూరి ఎరిక్షన్‌ బాబు పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలను గాలికొదిలిన వైసీపీ

పుల్లలచెరువు, ఫిబ్రవరి 6 : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలిందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గుడూరి ఎరిక్షన్‌ బాబు పిలుపునిచ్చారు. మంగళ వారం మండలంలోని ఉమ్మడివరంలో ‘బాబు షూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి తప్ప తప్ప అభివృద్ధి మచ్చుకైన కనిపించడం లేదన్నారు. రూ.83 కోట్లతో చిన్న కండ్లేరుకు వెలిగొండ టీ5ను అనుసంధానం పేరుతో జీవో ఇచ్చి నేటికీ పనులు ప్రారంభించలేదని అన్నారు. గ్రామంలో సీసీ రోడ్డు, డ్రేనేజీలు లేక మురుగు రోడ్లపైకి వస్తోందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎడాదికి మూడు గ్యాసు సిలిండర్లు, నెలకు 18 నుంచి 60 ఏళ్ల లోపు మహిళకు 1500 ఆర్థికసాయం అందజేస్తా మన్నారు. రైతులకు ఎడాదికి రూ.20వేలు సహాయం, నిరుద్యోగు లకు నెలకు 3 వేల భృతి అందజే స్తారని అన్నారు. వైసీపీ చేసే అక్ర మాలపై టీడీపీ అధికా రంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఎర్రగొండపాలెం నియోజక వర్గంలో మంత్రి ఉన్నా, రహదారులు మాత్రం అధ్వానంగా ఉన్నాయన్నారు. టీడీపీ అధికారంలో వున్నప్పుడు వేసిన రోడ్లు తప్ప ఎక్కడ రోడ్లు వేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌, టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు శనగా నారాయణరెడ్డి, టీడీపీ మండల నాయకులు కాకర్ల కోటయ్య, మునగాల రామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 01:17 AM