Share News

ప్రజాసమస్యలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం

ABN , Publish Date - Mar 12 , 2024 | 10:21 PM

ప్రజాసమస్యలను వైసీపీ ప్రభుత్వం గాలి కొది లేసిందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజమెత్తారు. అద్దంకి పట్టణం లోని 7వ క్లష్టర్‌ పరిధిలోని బూత్‌ల టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళ వారం రాత్రి స్థానిక నాగులపాడు రోడ్డులోని కామేపల్లి కల్యాణ మండ పంలో సమీక్ష నిర్వహించారు.

ప్రజాసమస్యలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
అద్దంకి పట్టణంలోని 20వ వార్డు నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

అద్దంకి, మార్చి 12: ప్రజాసమస్యలను వైసీపీ ప్రభుత్వం గాలి కొది లేసిందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజమెత్తారు. అద్దంకి పట్టణం లోని 7వ క్లష్టర్‌ పరిధిలోని బూత్‌ల టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళ వారం రాత్రి స్థానిక నాగులపాడు రోడ్డులోని కామేపల్లి కల్యాణ మండ పంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్‌ మా ట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం కష్టపపడి పనిచేసిన కార్యకర్తలకు భవిష్యత్‌లో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని చెప్పారు. వైసీపీ నేతల బెదిరింపులకు బెదరవలసిన పనిలేదన్నారు. వైసీపీ నేతలు కవ్వింపు చర్య లకు పాల్పడినా, వారి ఉచ్చులో చిక్కుకొని గొడవలకు దిగవద్దన్నారు. దొం గ ఓట్లతో ఎన్నికలలో గెలవాలని వైసీపీ నేతలు చూస్తున్నారన్నారు. ఎప్ప టికప్పుడు ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

మేదరమెట్ల వద్ద జరిగిన సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు డ బ్బులు, మద్యం పంపిణీ చేసినా ప్రజలలో అభిమానం లేక వెలవెల బోయిందని ఎమ్మెల్యే రవికుమార్‌ పేర్కొన్నారు. సిద్ధం సభకు 15 లక్షల మంది వచ్చారని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారని అన్నారు. అయి తే, వచ్చింది మాత్రం 1.50 లక్షల మందికి మించి లేరన్నారు. వైసీపీ అరా చక పాలన, ప్రజా వ్యతిరేఖ విధానాలను ఇంటింటికి వెళ్ళి వివరించా లన్నారు. అదే సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమ లుపరిచే పథకాలను కూడా వివరించాలని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాం లో అద్దంకి పట్టణంలోని నిరుపేదలకు శింగరకొండ వద్ద టిడ్కో ఇళ్లను 90 శాతం పూర్తిచే స్తే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేదన్నారు. ఆ ఇళ్ళ మీద మాత్రం జగన్‌ అప్పులు తీసుకువచ్చారన్నారు. అద్దంకి పట్టణ ప్రజల శాశ్వత మంచినీటి పరిష్కారం కోసం రూ.82 కోట్లు మంజూరు చే యించి పనులు అప్పట్లోనే ప్రారంభించినా ఇంతవరకు పూర్తి చేయలే దన్నారు. టీడీపీ ప్రభుత్వం పేదల కోసం అన్నా క్యాంటిన్‌లు, పండుగలకు ఇచ్చిన కానుకలు, పెళ్ళి కానుకలు వంటి పథకాలను రద్దు చేసిన జగన్‌ రెడ్డి పేదల పక్షపాతి ఎలా అవుతారన్నారు. విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీ లు పెంచి పేదలను దోచుకుంటున్నా ఇంకా పేదల మనిషి అని చెప్పుకునే అర్హత లేదన్నారు. జగన్‌రెడ్డిని గద్దెదించేందుకు అన్ని వర్గాల ప్రజలు సి ద్ధంగా ఉన్నారని చెప్పారు. సంపద సృష్టించి పేదరికం లేని సమాజం రూ పొందించడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. సమీక్షా సమావేశాలలో టీడీపీ నేతలు కాకాని అశోక్‌, కోనేటి అనిల్‌, సందిరెడ్డి శ్రీనివాసరావు, గార్లపాటి శ్రీనివాసరావు, దామా హనుమంతరావు, త్రిమూర్తులు, మున్నంగి స్టాలిన్‌ , బౌజంకు నాగరాజు, కౌన్సిలర్‌ మాగులూరి తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

నవశకానికి నాంది పలికేలా చిలకలూరిపేట సభ

నవశకానికి నాంది పలికేలా ఈనెల 17న టీడీపీ, జనసేన, బీజేపీల ఆ ధ్వర్యంలో చిలకలూరిపేటలో సభ జరగనుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్‌ పేర్కొన్నారు. ఈ సభకు అద్దంకి నియోజకవర్గం నుంచి పెద్ద సం ఖ్యలో తరలి రావాలన్నారు. రాతి యుగం నుంచి రాష్ర్టాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకు మూడు పార్టీల పొత్తు అని అన్నారు. 2014 ఎన్ని కల ఫలితాన్ని తిరగరాసేలా రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో మళ్ళీ ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. చిలకలూరిపేట వద్ద జరిగే సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబునాయుడు, పవన్‌కలా ్యణ్‌లు హాజరవుతారన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 10:21 PM