Share News

రానున్న ఎన్నికల్లో వైసీపీ అడ్రస్‌ గల్లంతు

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:26 PM

మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అడ్రస్‌ గల్లంతవుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమబాట పట్టించాలంటే ముందుచూపు, దార్శనికత ఉన్న చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. పంచాయతీ పరిధిలోని పాకలరోడ్డు నుంచి ట్రంకురోడ్డుకు ఇరువైపులా దుకాణాల వద్ద గురువారం నిర్వహించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో స్వామి మాట్లాడారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీ అడ్రస్‌ గల్లంతు
ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే స్వామి, టీడీపీ నేతలు

సింగరాయకొండ, జనవరి 11 : మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అడ్రస్‌ గల్లంతవుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమబాట పట్టించాలంటే ముందుచూపు, దార్శనికత ఉన్న చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. పంచాయతీ పరిధిలోని పాకలరోడ్డు నుంచి ట్రంకురోడ్డుకు ఇరువైపులా దుకాణాల వద్ద గురువారం నిర్వహించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో స్వామి మాట్లాడారు. వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ప్రజలు విసిగెత్తిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనానికి రూపాయి పంచి రూ. పది దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతల వికృత చేష్టల పోకడల వలన వ్యాపార రంగం చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, నేతలు చీమకుర్తి కృష్ణ, షేక్‌ సంధానీబాషా, కూనపరెడ్డి సుబ్బారావు, సుదర్శి చంటి, పులి ప్రసాద్‌, పాకల సర్పంచ్‌ చంద్రశేఖర్‌, భైరననేని మోహన్‌రావు, ఇమ్మిడిశెట్టి రామారావు, గుదే వెంకటేశ్వర్లు, చిగురుపాటి గిరి, మించల బ్రహ్మయ్య, వేల్పుల వెంకట్రావు, బ్రహ్మేశ్వరరావు, అబ్దుల్‌ సుభాన్‌, యస్థాని, సనావుల్లా, మాబాషా, సన్నెబోయిన మాలకొండయ్య, కాకా శ్రీనివాసులు, రావులపల్లి వెంకట్రావు, కళ్లగుంట నరసింహ, దక్షిణం శ్రీను, శీలం చంటి, జుమ్ము శంకర్‌, తుమ్మా కోటేశ్వరరావు, జనసేన నేతలు అడుసుమల్లి సుధాకర్‌, దండే ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:26 PM