Share News

త్రిపురాంతకంలో అమ్మవారికి పూజలు

ABN , Publish Date - May 24 , 2024 | 12:09 AM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో వైశాఖ పౌర్ణమి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

త్రిపురాంతకంలో అమ్మవారికి పూజలు

త్రిపురాంతకం, మే 23: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో వైశాఖ పౌర్ణమి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వేదమంత్రాల నడుమ త్రిపురాంతకేశ్వరునికి లక్షబిల్వార్చన, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారికి లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. అనంత రం ఆలయాల ప్రధానార్చకులు విశ్వన్నారాయణశాస్త్రి, పాలంక ప్రసాదశర్మలు భక్తులకు తీర్ధ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

గరుడ ఉత్సవం

గిద్దలూరు : పట్టణంలోని కొండపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరునాళ్ల, బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవరోజు గురువారం స్వామి వారి కి గరుడ ఉత్సవం, ఊంజల్‌ సేవ నిర్వహించారు. నియోజకవర్గ దేవాల యాల కమిటీ ఆధ్వర్యంలో భరత నాట్య ప్రదర్శన నిర్వహించగా పలు వురిని అలరించింది. భరతనాట్య ప్రదర్శనకు హాజరైన మహిళలకు పట్టుకుంటే పట్టుచీర కార్యక్రమంలో భాగంగా లక్కీడిప్‌ ద్వారా 20 మందికి చీరలు అందచేశారు.

పెద్దదోర్నాల :దోర్నాలలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవ వేడుకలను గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి, మణిశర్మ గణేశునికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంత్పర్పణ నిర్వహించారు. సాయంత్రం గణపతి ఉత్సవవిగ్రహాన్ని రథంపై ప్రతిష్టించి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో కమిటి పెద్దలు బీవీఎల్‌ ప్రసాద్‌, ప్రసన్న, మొగిలి సుబ్బారావు, పీ రామారావు, బొగ్గరపు రమేష్‌ పాల్గొన్నారు.

వైభవంగా సత్యదేవుని రథోత్సవం

మార్కాపురం వన్‌టౌన్‌ : పట్టణంలోని 9వ వార్డులో వెలసిన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు గౌరిశంకర శర్మ మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యదేవుని ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి వివిధ పుష్పాలతో అలంకరించి రథంపై ఆశీనులను చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బాసాని సుధాకర్‌, కార్యదర్శి సుబ్బారావు, సహాయ కార్యదర్శులు నూనె రామిరెడ్డి, ఉమామహేశ్వరరావు, కోశాధికారి కామిశెట్టి సుధాకర్‌, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు పర్యవేక్షించారు.

Updated Date - May 24 , 2024 | 12:09 AM