టీడీపీ బలోపేతానికి కృషి చేయండి
ABN , Publish Date - Apr 03 , 2024 | 10:27 PM
ఎన్నికలలో తెలుగదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కోరారు. బుధవారం చిలకలూరిపేటలో ని ఎఎమ్మెల్యే గృహంలో బుధవారం మండలంలోని వేమవరానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి ఎమ్మెల్యే రవికుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు.

ఎమ్మెల్యే గొట్టిపాటి
బల్లికురవ, ఏప్రిల్ 3 : ఎన్నికలలో తెలుగదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కోరారు. బుధవారం చిలకలూరిపేటలో ని ఎఎమ్మెల్యే గృహంలో బుధవారం మండలంలోని వేమవరానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి ఎమ్మెల్యే రవికుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈసందర్భంగా అయన మా ట్లాడుతూ వైసీపీ పార్టీ చేపట్టిన తప్పుడు ప నుల వలన అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యా యం జరిగిందన్నారు. ప్రజా సమస్యలు పట్టకుండా ప్రచార పిచ్చితో జగన్ పనిచేశారని అయన విమర్శించారు. అనంతరం గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వారితో చర్చించారు. గతంలో టీడీపీ ప్రబుత్వం ద్వారా పలు సీసీ రోడ్లు వేయించిన విషయాన్ని అయన వారికి గుర్తు చేశారు. పార్టీలో చేరిన వారిలో గరికపాటి సుబ్బారావు, ధర్మయ్య, పొత్తూరి సతీష్, గరికపాటి సత్యనారాయణ, చలపతి, రామకోటేశ్వరరావు, పొత్తూరి సుబ్బారావు, రామారావు, గోవర్దనయ్య, హరిబాబు ఉన్నారు.
పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మేల్యే రవికుమార్
మండలంలోని వేమవరం గ్రామంలో టీడీపీ నేత పేరం సుబ్బయ్య కుమారుడు సాయితేజ ఇటీవల మృతి చెందడంతో బుధవారం వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే గొట్టిపాటి పరామర్శించారు. అలాగే ఎస్టీ కాలనీలో కార్యకర్త భూక్యానాయక్ మృతిచెందగా ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. వారి కుటుంబాన్ని ఎమ్మేల్యే పరామర్శించారు. కార్యక్రమంలో గ్రామ నేతలు గొట్టిపాటి మారుతి ఉన్నారు.