ప్రతి కార్యకర్త సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Oct 27 , 2024 | 01:33 AM
కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.
మార్కాపురం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక జవహర్‌నగర్ కాలనీ లోని టీడీపీ కార్యాలయంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఆయన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం నియోజకర్గంలో 50 వేల పార్టీ సభ్యత్వం నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకు న్నట్లు తెలిపారు. ప్రతి నాయకుడు, క్రియాశీలక కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాల న్నారు. ముఖ్యంగా సభ్యత్వం తీసుకుంటే రూ.5 లక్షల ప్రమాద బీమా ఉందనే విషయాన్ని కార్యకర్తలకు చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి, కౌన్సిలర్ నాలి కొండయ్య, మాలపాటి వెంకటరెడ్డి, మర్రి.కొండలు, తడికమళ్ల బాలసుబ్బారావు, కొప్పుల వెంకటే శ్వర్లు, పఠాన్ హుసేన్‌ఖాన్, షాకీర్, దూపాటి యలమంద, మేడిద రంగస్వామి పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం(పుల్లలచెరువు) :టీడీపీ సభ్యత్వాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వైపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. శనివారం ఎర్రగొండపాలెం పట్టణంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభంచారు. ముందుగా ఎరిక్షన్‌బాబు లక్ష రూపాయలతో శాశ్వత సభ్యత్వం తీసుకొని మరో 15 మందికి లక్ష రూపాయలతో శాశ్వత సభ్యత్వం ఇప్పించారు. సభ్యత్వం ఇప్పించారు. కస్టర్ల వారిగా ప్రతి ఒక్కరు టీడీపీ సభ్యత్వం తీసుకోనేందుకు టీడీపీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బయ్య, పయ్యావుల ప్రసాద్, మల్లికార్జునరెడ్డి, నాయకులు వేగినాటి శ్రీనివాస్, కామేపల్లి వెంకటేశ్వర్లు,కాకర్ల కోటయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి, శనగా నారాయణరెడి,్డ షేక్.వలి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కంభం : మండలంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. కంభం పట్టణంలో సభ్యత్వ నమో దు కార్యక్రమాన్ని షేక్ అత్తర్‌హుస్సేన్, చమన్ తది తరులు 53, 54 పోలింగ్ కేంద్రాల పరిధిలో నమోదు చేయించారు.కార్యక్రమంలో బూత్ కన్వీనర్ నాగూర్‌వలి, ఖాదర్‌వలి, ఖాదర్‌హుస్సేన్, రజాక్, రవి, పాల్గొన్నారు.
పెద్దదోర్నాల : స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయం వీధిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని తెలుగు యువత అధ్యక్షులు దొడ్డా శేషాద్రి శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు చంటి, షేక్ సమ్మద్‌బాష, ఈదర మల్లయ్య, షేక్ ఇస్మాయిల్, బాష, ఎలకపాటి చెంచయ్య, బట్టు సుధాకర్‌రెడ్డి, ఏర్వ మల్లికార్జునరెడ్డి, షేక్. మౌలాలి, రఫీ, తాతిరెడ్డి, దానం తదితరులు పాల్గొన్నారు.
గిద్దలూరు టౌన్ : టీడీపీ సభ్యత్వ నమోదు గిద్దలూరు నియోజకవర్గంలో ముమ్మవరంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదేశానుసారం నియోజక వర్గంలో పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదు తీసుకుంటున్నారు. పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు దుత్తా బాలీశ్వరయ్య లక్ష రూపాయలు చెల్లించి టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకు న్నారు. ఈ సందర్భంగా బాలీశ్వరయ్య మాట్లాడుతూ టీడీపీ పట్ల అభిమానం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే తనను ఆకర్షించాయని, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలతో తాను స్ఫూర్తి పొందానన్నారు.
టీడీపీ సభ్యత్వంతో కుటుంబ భద్రత
పెద్దారవీడు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వ నమోదుతో కుటుంబభద్రత ఉంటుందని ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు గొట్టం రామనారాయణరెడ్డి, వల్లూరి సుబ్బారెడ్డి, వేశపోగు సాల్మన్ రాజు, పిక్కిలి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.