వామ్మో.. పులి!
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:19 AM
నల్లమల అటవీ పరిధిలోని అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురం గ్రామ పరిసరాలలో చిరుతపులి సంచరిస్తోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి 11గంటలకు కంభం నుంచి అర్థవీడుకు నాగూర్‌వలి, మరో ఇద్దరు కారులో వెళ్తుండగా మొహిద్దీన్‌పురం-నాగులవరం గ్రామాల మధ్య రోడ్డు వెంట వారికి చిరుతపులి కనిపించింది.

మొహిద్దీన్‌పురం వద్ద చిరుత సంచారం
భయాందోళనలో ప్రజలు
కంభం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అటవీ పరిధిలోని అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురం గ్రామ పరిసరాలలో చిరుతపులి సంచరిస్తోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి 11గంటలకు కంభం నుంచి అర్థవీడుకు నాగూర్‌వలి, మరో ఇద్దరు కారులో వెళ్తుండగా మొహిద్దీన్‌పురం-నాగులవరం గ్రామాల మధ్య రోడ్డు వెంట వారికి చిరుతపులి కనిపించింది. దీంతో వెంటనే వారు సమీపంలోని పొలంలో ఉన్న కాపరులకు విషయం చెప్పి అప్రమత్తం చేశారు. విషయం తెలుసుకుని తమ సిబ్బందిని ఆప్రాంతానికి పంపినట్లు మార్కాపురం డిప్యూటీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ప్రజలు, రైతులు, కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.