Share News

ప్రజావిశ్వాసంలేక ‘సిద్ధం’ వెలవెల

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:09 AM

ప్రజావిశ్వాసం లేక మేదరమెట్ల వద్ద జరిగిన సిద్ధం సభ వెలవెలబోయిందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పుట్టావారిపాలెం అతిథి గృహంలో కుందుర్రు, మామిళ్ళపల్లి, పరిటాల వారిపాలెం, అడవిపాలెం, కామేపల్లి, మక్కెనవారిపాలెం గ్రామాల టీడీపీ శ్రేణులతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సమావేశమయ్యారు.

ప్రజావిశ్వాసంలేక ‘సిద్ధం’ వెలవెల
ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన వైసీపీ నాయకులు

- ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

సంతమాగులూరు, మార్చి 11: ప్రజావిశ్వాసం లేక మేదరమెట్ల వద్ద జరిగిన సిద్ధం సభ వెలవెలబోయిందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పుట్టావారిపాలెం అతిథి గృహంలో కుందుర్రు, మామిళ్ళపల్లి, పరిటాల వారిపాలెం, అడవిపాలెం, కామేపల్లి, మక్కెనవారిపాలెం గ్రామాల టీడీపీ శ్రేణులతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలకోట్ల ప్రజల ఆస్తులను కొల్లగొట్టి అన్నివర్గాలను ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మేదరమెట్ల వద్ధ జరిగిన సభలో జగన్‌ అబద్ధాల విషపు జల్లు కురిపించారని ధ్వజమెత్తారు.

చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉంటుందని ఎమ్మెల్యే రవికుమార్‌ చెప్పారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా వైసీపీ నేతలు ఫాం-7 దరఖాస్తులు పెడుతూ కుట్రలకు తెరలేపారని అన్నారు. నాసిరకం మద్యంలో జగన్‌ లక్ష కోట్లు కమీషన్‌ కొట్టేశారని అన్నారు. అందులో భాగంగానే డిజిటల్‌ పేమెంట్స్‌ లేకుండా చేశారని పేర్కొన్నారు. జగన్‌ పాలనలో అన్నివర్గాలు నష్టపోయాయని అన్నారు.

కాగా సంతమాగులూరు మండలం కొప్పరం ఉత్తరబజారుకు చెందిన వడియరాజులు 60 కుటుంబాలు, మాజీ ఎంపీటీసీ షేక్‌ బోడా ఆద్వర్యంలో 50 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కార్యక్రమంలో దూపాటి ఏసోబు, అట్లా చినవెంకటరెడ్డి, చేవూరు వాసిరెడ్డి, తేలప్రోలు రమేష్‌, గాడిపర్తి వెంకట్రావు, గురు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:09 AM