Share News

కలలకు రెక్కలు పథకం మహిళలకు ఎంతో ప్రయోజనం

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:17 AM

అంతార్జాతీమ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత కలలకు రెక్కలు అనే సరికొత్త పఽథకాన్ని తీసుకొని వస్తుందని ఆ పథకంతో మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని టీడీపీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్ధి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక సత్యదేవుని కల్యాణ మండపంలో సూర్యచంద్రసేవా సంస్థ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉగ్ర పాలొన్నారు.

కలలకు రెక్కలు పథకం మహిళలకు ఎంతో ప్రయోజనం
మహిళలను సన్మానిస్తున్న ఉగ్ర

పామూరు, మార్చి 8 : అంతార్జాతీమ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత కలలకు రెక్కలు అనే సరికొత్త పఽథకాన్ని తీసుకొని వస్తుందని ఆ పథకంతో మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని టీడీపీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్ధి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక సత్యదేవుని కల్యాణ మండపంలో సూర్యచంద్రసేవా సంస్థ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉగ్ర పాలొన్నారు. ఈ సందర్భంగా శంకర్‌ మాస్టర్‌చే నిర్వహించిన శివతాండవ నృత్యరూపాన్ని ప్రదర్శించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కే సుభాషిణి ఎం చందనను శాలువాలతో సత్కరించి మెమెంటో అందజేసారు. ఈ కార్యక్రమంలో ఉగ్ర మాట్లాడుతు చంద్రబాబు ప్రకటించిన మహిళాశక్తి పఽథకాలతోపాటు కలలకు రెక్కలు అనే పఽథకం ద్వారా చదువుకున్న మహిళలు ఆర్థికంగా బలోపేతం చెందేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించే కొత్త పథకాన్ని ప్రకటించారని తెలిపారు. మహిళలందరూ టీడీపీకి మద్దతు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పువ్వాడి వెంకటేశ్వర్లు, జి. దశరఽథరామయ్య, షేక్‌ ఖాజారహంతుల్లా, పాలపర్తి వెంకటేశ్వర్లు, దేవరపు మాల్యాద్రి, ఉప్పలపాటి హరిబాబు, సయ్యద్‌ అమీర్‌బాబు, ఇర్రి కోటిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:18 AM