అభివృద్ధి కోసం నన్ను గెలిపించండి
ABN , Publish Date - Mar 03 , 2024 | 10:27 PM
కనిగిరి ప్రాంత అభి వృద్ధి కోసం తనను గెలిపించాలని టీడీపీ ఎ మ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ప్రజలకు సూచించారు. 7వ వార్డు కొత్తూరులో వైసీపీని వీడి ఉగ్ర సమక్షంలో 26 కుటుంబాలతో పాటు, ఇద్దరు వలంటీర్లు టీడీపీలో ఆ దివారం చేరారు. వారికి ఆయన కండువాలు వే సి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఉగ్ర
కొత్తూరులో వైసీపీని వీడిన 26 కుటుంబాలు
వారితో పాటు డాక్టర్ ఉగ్ర సమక్షంలో పార్టీలో చేరిన వలంటీర్లు
కనిగిరి, మార్చి 3 : కనిగిరి ప్రాంత అభి వృద్ధి కోసం తనను గెలిపించాలని టీడీపీ ఎ మ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ప్రజలకు సూచించారు. 7వ వార్డు కొత్తూరులో వైసీపీని వీడి ఉగ్ర సమక్షంలో 26 కుటుంబాలతో పాటు, ఇద్దరు వలంటీర్లు టీడీపీలో ఆ దివారం చేరారు. వారికి ఆయన కండువాలు వే సి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొత్తూరు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉగ్ర మా ట్లాడుతూ వైసీపీ పాలనలో కనిగిరి ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తనకు అవకాశం ఇస్తే అభివృద్ధితోపాటు పే దల సమస్యల పరిష్కారానికి నిరంతరాయంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లుగా మీవెంటే ఉంటూ తనకు చేతనైనంత సాయం చేస్తున్నాని గుర్తు చేశారు. ఐదేళ్ల జగన్‌రెడ్డి పా లనలో రా ష్ట్రం అన్నిరంగాల్లో నాశనమైందని, ఉద్యోగులు, కార్మికు లు, ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారని ఉ గ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ చక్కబడాలంటే చం ద్రబాబను అందరం ముఖ్యమంత్రిని చేయాలన్నారు. భవిష్యత్ తరాల కోసం టీడీపీకి పట్టంగట్టాలని వి జ్ఞప్తి చేశారు. కనిగిరి మున్సిపాల్టీగా మారితే అన్ని వ సతులతో పాటు నగరాభివృద్ధి జరుగుతుందన్నారు. క నీసం నగర ప్రజలకు తాగునీరు కూడా వైసీపీ ఎమ్మె ల్యే ఇవ్వలేకపోయారన్నారు. కనిగిరి ప్రాంతంలోనే పు ట్టానని ఈ ప్రాంతం అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. సొంత చెల్లిని, అమ్మను పట్టించుకోని వారు రాష్ట్ర మహిళలకు న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించా రు. బాబాయి చావుకు కారణమై, అతని కుమార్తెకు అ న్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిక ల్లో అడ్డదారిలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అ నేక వ్యూహాలు పన్నుతున్నారని, రోజులు దగ్గరపడడం తో ప్రజలపై వరాలు కురిపిస్తూ ప్రేమను ఒలగపోస్తున్నారన్నారు. జగన్‌రెడ్డి అబద్ధపు మాటలు, మడమతి ప్పే హాలను ప్రజలు మళ్లీ నమ్మి మోసపోవద్దని ఉగ్ర హితవు చెప్పారు. విజ్ఞతతో ఆలోచించి, అభివృద్ధిని కాంక్షించేవారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎ న్నికలు పూర్తయ్యే వరకూ రోజూ అప్రమత్తంగా ఉం టూ తన విజయానికి కృషి చేయాలని ఉగ్ర విజ్ఞప్తి చే శారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో తమ్మినేని రవీంద్రరెడ్డి, వెంకటరెడ్డి (వలంటీర్లు), దశరదరామిరెడ్డి, గోపిరెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, శివరామిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, బ్రహ్మారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రమణారెడ్డిలతో పాటు మరో 20 కుటుంబాలు వారు ఉన్నారు.
అలాగే కనిగిరి మండలం బల్లిపల్లి గ్రామంలో 48 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర సమక్షంలో సైకిల్ ఎక్కారు. వారికి కండువాలు కప్పి ఉగ్ర స్వాగతం పలికారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు
ఉగ్ర సమక్షంలో వైసీపీ సర్పంచ్, ఆరుగురు వార్డు
మెంబర్లతో సహా 65 కుటుంబాల చేరిక
వెలిగండ్ల : వెలిగండ్ల మండలంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ త గిలింది. మండలంలోని రామగోపాలపురం పంచాయతీ సర్పంచ్ బొబ్బా రమణారెడ్డి, ఆరుగురు వార్డు మెంబర్లతో సహా గ్రామానికి వైసీపీ మద్దతుదారులు 65 కుటుంబాలు గుడ్‌బై చెప్పారు. వారంతా ఆదివారం టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర సమక్షంలో సైకిల్ ఎక్కారు. పార్టీ కండువాలు వేసి వారిని ఉగ్ర ఆహ్వానించారు. నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయన్నా రు. ఇది వైసీపీ పతకానికి నాంది అని ఉగ్ర అన్నారు. కొత్తగా చేరినవారిని క లుపుకొని కష్టపడి పనిచేసి తనను గెలిపించాలని కోరారు. గెలవగానే రామగోపాలపురం పంచాయతీలో నిరుపేదలకు భూముని అందజేస్తామని హామీ ఇచ్చారు. జగన్‌రెడ్డిని నమ్ముకొని సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు అప్పులపాలయ్యారన్నారు. ప్రజలకు ఎలాంటి సేవ చేయలేని దుస్థితిలో ఆవేద నకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు ముత్తిరెడి, జిల్లా అధికార ప్రతినిధి గవదకట్ల హరి, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు కేలం ఇంభ్రూపాల్‌రెడ్డి, బీసీసెల్ అధ్యక్షుడు మౌలాలీ, జిల్లా ఎస్సీసెల్ అధికారప్రతినిధి సలోమన్ రాజు, ఎంపీటీసీ స భ్యుడు చిలకల వెంకటేశ్వరెడ్డి, కొండు భాస్కర్‌రెడ్డి కర్నాటి భాస్కర్ రెడ్డి, మీనిగ కాశయ్య, కారంపూడి వెంటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు మెటాటి సుబ్బరెడ్డి, ఓఠిొలు శ్రీ ను, కేసరి రమణారెడ్డి, రావి అంబయ్య చౌదరి, బొబ్బా నాగభూసాల్ రెడ్డి, బొ బ్బా రమణారెడ్డి, గంజి రాజశేఖర్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గోన్నారు.
అనంతరం డాక్టర్ ఉగ్ర నియోజకవర్గ టీడీపీ నాయకులు, ప్రముఖ పారిశ్రమికవేత్త శ్యామల కాశిరెడ్డి సహకారంతో బ్యాంక్ ఆవరణంలో శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.