పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:22 AM
టీడీపీ గెలుపుకోసం పాటుపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

పొదిలి, జూన్ 16 : టీడీపీ గెలుపుకోసం పాటుపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పొదిలి పట్టణంలో ఆదివారం పొదిలి, కొనకనమిట్ల మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకుని శ్రమ ఫలితమే ఈ అఖండ విజయమన్నారు. టీడీపీ విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయానికి కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని వారికి భవిష్యత్తులో అన్నివిధాలుగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మార్కాపురం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేద్దా మన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, వార్డును అభి వృద్ధి పథంలో అందరం కలిసికట్టుగా నడిపిద్దామన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టు కొనేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా కార్యకర్తలు మాట్లాడుతూ పొదిలిలో తాగినీటి సమస్యను త్వరితగతిన తీర్చాలని, వెలుగొండ జలాలను పొదిలి ప్రాంతానికి తీసుకురావాలని కోరారు. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతుగా శక్తివంచన లేకుండా కృషి చేస్తాన న్నారు. కార్యక్రమంలో పొదిలి, కొనకనమిట్ల మండలాల టీడీపీ అధ్యక్షులు మీగడ ఓబుల్‌రెడ్డి, మోరబోయిన బాబురావు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.