Share News

ఓటు హక్కుపై విస్తృత ప్రచారం

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:01 AM

వచ్చే నెలలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అర్హులంతా ఓటు హక్కును వినియోగించుకొనేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

ఓటు హక్కుపై విస్తృత ప్రచారం
ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ఒంగోలులో రూపొందించిన సైకత శిల్పం వద్ద కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఇతర అధికారులు, శిల్పి బాలాజీ

జిల్లా ఎన్నికల అధికారి దినేష్‌కుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 26 : వచ్చే నెలలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అర్హులంతా ఓటు హక్కును వినియోగించుకొనేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులందరూ ఓటు హక్కును వినిగించుకోవాలని కోరారు. పట్టణ ప్రజలు కూడా చురుగ్గా ఓటింగ్‌లో పాల్గొనేలా వివిధ రూపాల్లో స్వీప్‌ కార్యక్రమాలు చేపట్టామన్నారు. విజయవాడకు చెందిన అంతర్జాతీయ గుర్తింపు పొందిన సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్‌ ఈ సైకత శిల్పాన్ని తయారు చేసినట్లు చెప్పారు. సుమారు 30 టన్నుల ఇసుకతో రెండు రోజుల్లో దీనిని రూపొందించిన ఆయన్ను కలెక్టర్‌ అభినందించి సన్మానించారు.

Updated Date - Apr 27 , 2024 | 01:01 AM